Dubai
fire at Dubai jebel aliport : దుబాయ్‌లోని పోర్టులో భారీ పేలుడు సంభవించింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గురువారం (జులై 8,2021) తెల్లవారుఝామున ప్రపంచంలోని అతిపెద్ద ఓడరేవులలో ఒకటైన జెబెల్ అలీ పోర్టులో భారీ పేలుడు సంభవించింది. అరేబియా ద్వీపకల్పానికి తూర్పు వైపున పెర్షియన్ గల్ఫ్‌లో ఉన్న జెబెల్ అలీ పోర్టులో లంగరు వేసిన ఓ కంటైనర్ షిప్‌కు మంటలు అంటుకోవడంతో ఈ భారీ పేలుడు సంభవించింది.
దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేరాలేదు. అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ భారీ విస్ఫోటనం కారణంగా పెద్ద శబ్దాలు వెలువడినట్లు పోర్టుకు దగ్గరలోని స్థానికులు తెలిపారు. 25 కిలోమీటర్ల (15 మైళ్ళు) దూరంలో ఉన్నవారు కూడా హడలిపోయారంటే ఈ పేలుడు ధాటి ఎంత తవ్రంగా ఉందో ఊహించుకోవచ్చు.
ఈ పేలుడు ధాటికి ొక్కసారిగా స్థానికంగా ఉండే భవనాలు దద్దరిల్లిపోయాయి. స్వల్పంగా కంపించాయి. ఈ పేలుడు తెల్లవారుఝామునకావటంతో జనాలు ఇంకా పూర్తిగా నిద్రలేవలేదు. దీంతో ఆ పేలుడు ధాటికి భవనాలు కంపించిపోవటంతో భూకంపం అనుకుని భయాందోళనలకు గురయ్యావతీ స్థానికులు తెలిపారు. ఏం జరిగిందో తెలియక ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు బయటకు పరుగులెత్తుకుని వచ్చి చూడగా..ఆకాశంమంతా ఎరుపు రంగులోకి మారిపోయి ఉందన్నారు.
ప్రమాద దృశ్యాలను జనం తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఇప్పుడీ వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, దుబాయ్‌లోని జెబెల్ అలీ నౌకాశ్రయం ప్రపంచంలోనే అతిపెద్దది. ఈ పోర్టు నుంచి భారత ఉపఖండంతో పాటు ఆఫ్రికా, ఆసియాకు సరుకుల రవాణా జరుగుతుంది.