Taliban Fatwa on Co-education: అన్నీ చెడ్డ పనులకు మూలం కో ఎడ్యుకేషన్ – తాలిబాన్లు
అఫ్ఘానిస్తాన్‌లో అధికారికంగా అరాచకాలు మొదలుపెట్టేశారు. మహిళల హక్కులను గౌరవిస్తామని ప్రకటించిన మరుసటి రోజే హెరాత్ ప్రావిన్స్‌లోని యూనివర్సిటీల్లో కో-ఎడ్యుకేషన్‌పై బ్యాన్ విధించారు.

Co Education In Afghanistan
Taliban Fatwa on Co-education: అఫ్ఘానిస్తాన్‌లో అధికారికంగా అరాచకాలు మొదలుపెట్టేశారు. మహిళల హక్కులను గౌరవిస్తామని ప్రకటించిన మరుసటి రోజే హెరాత్ ప్రావిన్స్‌లోని యూనివర్సిటీల్లో కో-ఎడ్యుకేషన్‌పై బ్యాన్ విధించారు. సమాజంలో అన్ని చెడులకూ మూలం కో-ఎడ్యుకేషనే అంటూ ప్రభుత్వవర్గాలు వెల్లడిస్తున్నాయి. యూనివర్సిటీల్లో ఉండే ప్రొఫెసర్లు, ప్రైవేటు వర్సిటీ ఓనర్లు, తాలిబన్ నేతలతో 3 గంటలపాటు సమావేశం జరిగింది.
ఈ సందర్భంగానే ప్రకటన వెలువడించినట్లు అఫ్గాన్‌లోని ఖామా అనే న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. గతవారం అఫ్ఘాన్‌ను పూర్తిగా ఆక్రమించిన తర్వాత తాలిబన్లు జారీ చేసిన తొలి ఫత్వా ఇదే.
కో-ఎడ్యుకేషన్‌పై నిషేధం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని అఫ్గానిస్థాన్ ఉన్నత విద్యాధికారి వ్యాఖ్యానించారు. ఉమెన్ ప్రొఫెసర్లను టీచింగ్ కు మాత్రమే అనుమతించనున్నట్లు తెలిపారు. అఫ్గానిస్థాన్ రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న కో-ఎడ్యుకేషన్ విధానానికి తెరపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నిర్ణయం వల్ల గవర్నమెంట్ యూనివర్సిటీలపై పెద్దగా ప్రభావం ఉండకపోయినా, ఇప్పటికే మహిళా విద్యార్థుల సంఖ్యపై ఇబ్బంది పడుతున్న ప్రైవేటు వర్సిటీలకు ఇబ్బందిగా భావిస్తున్నారు.
ప్రస్తుతం హెరాత్‌లోని యూనివర్సిటీల్లో 40వేల మంది స్టూడెంట్లు, 2వేల మంది ప్రొఫెసర్లు ఉన్నట్లు ప్రభుత్వ లెక్కల ద్వారా తెలుస్తోంది.