కోటి రూపాయలు ఉంటేనే కరోనా వైరస్‌కు ట్రీట్‌మెంట్!!

కరోనా వైరస్ బారిన పడ్డ తొలి భారత జాతి మహిళ ప్రీతి మహేశ్వరి. ప్రాణాలతో పోరాడుతూ దానికి ఖర్చు అయ్యే కోటి రూపాయల ఆర్థిక సాయం కావాలని కోరుతోంది. చైనాలో ఉన్న ఆమె సోదరుడు మనీశ్ తపా ఒక అమెజాన్ ఉద్యోగి మాత్రమే. ఆర్థిక సాయం కావాలని బీజింగ్ లో ఉన్న భారత ఎంబస్సీని కలిసింది మహేశ్వరీ కుటుంబం. వాటితో పాటు భారత్‌లో ఉన్న పలు సహాయ నిధులను హాస్పిటల్ ఖర్చులకు డబ్బులు సమకూర్చాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. 

చైనాలో ఉంటున్న మహేశ్వరీ.. షెంజన్‌లో ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రైమరీ టీచర్‌గా పనిచేస్తుంది. టైప్ 1 రెస్పిరేటరీ ఫెయిల్యూర్ తో బాధపడుతోంది. ప్రస్తుతం చైనాలోనే ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వెంటిలేటర్స్, డయాలసిస్, రక్త శుద్ధి వంటి పద్దతుల్లో ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. 

‘చికిత్సకు అయ్యే ఖర్చు రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. 2020 జనవరి 11 నుంచి మొత్తం ఖర్చు రూ.10లక్షల చైనా యాన్‌‌లు(భారత కరెన్సీలో కోటి రూపాయలు అయింది. ఆర్థిక నిధులు సమకూరడం కోసం.. ఇంపాక్ట్‌గురు.కామ్‌ను సంప్రదించాను. కుటుంబానికి మించి ఆర్థిక భారం పడుతుండటంతో ఇంపాక్ట్‌గురు 410మంది దాతల నుంచి రూ.15.27లక్షల ఆర్థిక సాయం అందించింది’ అని మహేశ్వరీ సోదరుడు తపా తెలిపాడు. 

భారత్‌కు ఆమెను పంపేలోపే పూర్తిగా వ్యాధిని తగ్గించాలనుకుంటున్నాం. భారత ప్రభుత్వంతో సాయం కావాలని అడిగాం. కాంటాక్ట్ చేయాలనుకున్న స్నేహితులు, బంధువులకు  ఈ నెంబర్ల ద్వారా +8618612083629, +8618612083617 సంప్రదించాలని ఎంబస్సీ తెలిపింది.