వామ్మో: వరదలకు విమానమే కొట్టుకొచ్చేసింది

  • Published By: veegamteam ,Published On : March 18, 2019 / 04:22 AM IST
వామ్మో: వరదలకు విమానమే కొట్టుకొచ్చేసింది

ఇండోనేషియాలో ఆకస్మిక వరదలకు ఏకంగా ఓ విమానమే కొట్టుకొచ్చేసింది. దీన్ని చూసిన స్థానికుడు  ఆశ్చర్యపోయాడు. అంత పెద్ద విమానం వదల ధాటికి ఎలా కొట్టుకొచ్చేంసిందో అనుకుంటు ఆశ్చర్యానికి గురయ్యాడు. కాగా ఇండోనేషియా వరదల్లో 58 మంది మృతి చెందగా..వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పపువా ప్రావిన్స్‌లోని జయపుర జిల్లాలో వరద నీటికి కొట్టుకొచ్చిన బురద ఇళ్లల్లోకి చేరింది.

దీంతో కొట్టుకొచ్చి స్థానికులు పలు ఇబ్బందులు పడుతున్నారు.  వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా పర్వత సమీప గ్రామాల్లోకి సహాయసిబ్బంది కూడా వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి.  మరోపక్క ఆఫ్రియాదేశాలల్లో ఇడాయ్ తుఫాన్ బీభత్సం సష్టించి వందలాదిమందిని పొట్టన పెట్టుకుంది. మొజాంబిక్, జింబాబ్వే, మలావీ దేశాలను అతలాకుతలం అయ్యాయి.  15 లక్షలాదిమందికి పైగా నిరాశ్రయులయ్యారు. 
Read Also : మాలిలో ఉగ్రవాదుల ఘాతుకం: 21 మంది సైనికులు మృతి