నేపాల్‌లో మరో నలుగురు భారతీయులు మృతి

నేపాల్‌లో మరో నలుగురు భారతీయులు మృతి చెందారు. సిదార్థనగర్‌ మున్సిపాలిటీలోని గల్లమండి పిపారియాలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.

  • Publish Date - January 31, 2020 / 01:55 AM IST

నేపాల్‌లో మరో నలుగురు భారతీయులు మృతి చెందారు. సిదార్థనగర్‌ మున్సిపాలిటీలోని గల్లమండి పిపారియాలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.

నేపాల్‌లో మరో నలుగురు భారతీయులు మృతి చెందారు. సిదార్థనగర్‌ మున్సిపాలిటీలోని గల్లమండి పిపారియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతులు షాజాద్‌ హుస్సేన్‌(30), భార్య సద్దాబ్‌ ఖాతున్‌, రెండేళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడుగా గుర్తించారు. 

బీహార్‌కు చెందిన షాజాద్‌ హుస్సేన్‌ 15 సంవత్సరాల క్రితం నేపాల్‌కు వచ్చి స్థిరపడిందని పోలీసులు వివరించారు. చెత్తకాగితాలు ఏరుకుని స్థానికంగా జీవిస్తున్నారని తెలిపారు. వారు నివసిస్తున్న ఇంట్లో బస్తాల కింద ఊపిరాడక చనిపోయి ఉండగా గుర్తించినట్లు చెప్పారు. 

ఇటీవల నేపాల్‌ పర్యటనకు వెళ్లిన కేరళకు చెందిన ఎనిమిది మంది మృతి చెందారు. ఓ హోటల్‌లో హీటర్‌ నుంచి గ్యాస్‌లీకైన కారణంగా అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన సంగతి తెలిసిందే.