Colette Maze : 107 ఏళ్ల వయస్సులో పియానో ఆల్బమ్ రిలీజ్ చేసిన బామ్మ

107 ఏళ్ల వయస్సులో ఓ బామ్మ పియానో ఆల్బమ్ ను రిలీజ్ చేసి ఔరా అనిపిస్తున్నారు.

107 Year Old French Pianist Colette Maze Has New Album : వయసు ఒక సంఖ్య మాత్రమే.అది పరువాల వయస్సు 16 అయినా..ముదుసలి వయస్సు 70 ఏళ్లు అయినా. మనస్సులో ఉత్సాహం ఉంటే వయస్సు ఒక సంఖ్య మాత్రమే అనిపిస్తుంది. ఉరికే ఉత్సాహం ఏ వయస్సులో అయినా ఆలోచించే మనస్సుని బట్టే ఉంటుందని నిరూపించింది సెంచరీ దాటి ఏడేళ్లు దాటిన ఓ బామ్మ. 107 ఏళ్ల వయస్సులో కొత్త ఆల్బమ్ ను విడుదల చేసి ఔరా అనిపించింది. తన 70ఏళ్ల కొడుకుతో కలిసి ఓ ఆల్బమ్ తయారు చేసి దాన్ని రిలీజ్ చేసి ఏమీ ఈ బామ్మగారి ఉత్సాహం ఈ వయస్సులో కూడా అనిపించింది.

60ఏళ్లకే అడుగు తీసి అడుగు వేయడం కూడా కష్టమైపోతోంది. ఫ్రాన్స్ కు చెందిన కొలెట్ట్‌ మేజ్‌ వయసు సెంచరీ దాటి ఏడేళ్లు అయ్యింది. అంటే ఆమె వయస్సు ఇప్పుడు 107 ఏళ్లు. అయినా పియానోపై రాగాల్ని అలవోకగా పలికించడమే గాక ఏకంగా కొత్త ఆల్బమ్‌ను విడుదలచేసింది..107 ఏళ్ల వయసులో డెబ్భై ఏళ్లకు పైబడ్డ కొడుకుతో కలిసి ఈ ఆల్బమ్‌ను విడుదల చేసి శెభాష్ అనిపించుకుంది కొలెట్ట్‌. 1914 జూన్‌ 16 న ఫ్రెంచ్‌లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన కొలెట్ట్‌ మేజ్ చిన్నప్పటినుంచి చాలా ఉత్సాహంగా ఉండేది. ఆమె ఎంత యాక్టివ్ అంటే నాలుగేళ్లకే పియానో వాయించాలనే కోరిక పెంచుకోవటం. అలా చిరుప్రాయంలోనే కొలెట్ట్ పియానో వాయించటంలో పేరు పొందింది. మ్యూజిక్‌ కోర్సు చేస్తానని తల్లిదండ్రులతో చెప్పిందా చిన్నారి. అది సరైన కెరీర్ కాదు కేవలం ఒక హాబీగా..టైమ్ పాస్ మాత్రమే పనికొస్తుందని ఆలోచించిన తల్లిదండ్రులు వద్దు అన్నా పట్టుదల వదల్లేదు.

Read more : Old Women Dance : బామ్మ డ్యాన్స్ కు…2కోట్ల వ్యూస్

15 ఏళ్ల వయసుకే చక్కగా పియానో వాయించటంలో పట్టు సాధించి..16 ఏళ్లకే మ్యూజిక్‌ స్కూలులో పియానో టీచర్‌గా చేరింది. 20 శతాబ్ద ప్రారంభంలో ఒక అమ్మాయి పియానో వాయించటం..టీచర్ కావటం అంటే మాటలు కాదు.అప్పటి నుంచి ఆమె పియానో సామ్రాజ్యం అంచెలంచెలుగా సాగింది. 20 ఏళ్లపాటు పియానో టీచర్‌గా పనిచేసింది. కొలెట్ట్‌ కు పియానో అంటే ప్రాణం.కొలెట్ట్ అంటే పియానో, పియానో అంటే కొలెట్ట్ అనిపించుకుంది.

అలా షూమాన్, క్లాడ్‌ డెబస్సీ మ్యూజిక్‌ అంటే ప్రాణంపెట్టే కొలెట్.. 84 ఏళ్ల వయసులో ఫస్టుటైమ్ ఆల్బమ్‌ విడుదల చేసింది. తాజాగా 107 ఏళ్ల వయసులో ఆరో ఆల్బమ్‌ను విడుదల చేసింది. గత పదిహేనేళ్లుగా రోజుకి ఎనిమిది గంటలు పియానో వాయించి వాటిని రికార్డు చేసి, సౌండ్‌ ఇంజినీర్‌ సాయంతో ఆల్బమ్‌లుగా మారుస్తోంది. ఇంతటి వృద్ధాప్యంలోనూ.. ఆమె ఎంతో యాక్టివ్‌గా ఉంటూ పియానో పై కీస్‌ ను ప్రెస్‌చేస్తూ సుమధుర సంగీతాన్ని అందిస్తోంది. పియానో వాయిస్తు..తనని తాను బిజీగా ఉండేలా చేసుకుంటుంది. అదే తన ఆరోగ్య రహస్యం అని కూడా అంటుందీ 107ఏళ్ల బామ్మ.

Read more : 94 ఏళ్ల బామ్మ..ఆమే పేరే బ్రాండ్..స్టార్టప్ తో లక్షలు సంపాదన

తన సంగీత ప్రపంచ అంటే ఆమెకు ప్రాణం. పియానో చూస్తే చాలా ఆమె వేళ్లు ఆటో మేటిక్ గా కదలిపోతాయి. మనస్సు సంగీతంతో నిండిపోతుంది. 107ఏళ్ల వయస్సులో పియానో ఆల్బమ్ విడుదల చేసిన సందర్భంగా ఈ పియానో బామ్మ మాట్లాడుతు..‘‘సంగీతం అనేది చాలా ప్రభావ వంతమైన, భావోద్వేగాలతో కూడుకున్నది. ప్రకృతి, భావోద్వేగాలు, ప్రేమ, కలలు, ఆశలు వంటి వాటన్నింటికి సంగీతమే ఆత్మీయ ఆహారంగా పనిచేస్తుంది. అందుకే నేను మ్యూజిక్‌ను కంపోజ్‌ చేయడానికి ఇష్టపడతాను..పియానో అంటే నా జీవితంలో విడదీయలేని భాగం’’ అని చెబుతుంది ఆనందం నిండిన మనస్సుతో నవ్వుతూ..

 

ట్రెండింగ్ వార్తలు