Friendship 2023
friendship day 2023 : ఒక రాక్షసుడ్ని సంహరించటానికి దేవతలు అంతా ఒక్కటయ్యారని పురాణాల్లో చదువుకున్నాం. రాక్షస సంహారం కోసం శ్రీ మహావిష్ణువు ఎన్నో అవతారాలు ఎత్తాడు. దుష్టశిక్షణ శిక్ష రక్షణ చేసిన మహానుభావుడిగా కారణ జన్ముడిగా పూజలందుకుంటున్నాడు. శ్రీ మహా విష్ణువు దశావతారాలు ఎత్తింది కూడా రాక్షస సంహారాల కోసమే. అటువంటి రాక్షస సహారంలో స్నేహితుల పాత్ర ఏంటి..? అనేది ఈ స్నేహితుల దినోత్సం సందర్భంగా తెలుసుకుందాం..
ఆదిదేవులు, జగన్మాతల మధ్య స్నేహంతో జరిగిన రాక్షస సంహారం
మన హిందూ పురాణాల ప్రకారం ఆదిదేవుళ్లు సృష్టి, స్థితి, లయకారకారులుగా వెలుగొందుతున్నారనే విషయం తెలిసిందే. బ్రహ్మ సృష్టికర్త. విష్ణువు సృష్టి పాలకుడు. ఇక మహేశ్వరుడు అంటే పరమ శివుడు సృష్టి లయ కారకుడు. ఈ ముగ్గురు ఆదిదేవులు. అంతేకాదు ఈ ముగ్గురు కవలని కూడా అంటారు.వీరి ముగ్గురు ఆదిదేవుళ్లుగా పూజలందుకుంటున్నారు. అటువంటి ఆదిదేవుళ్ల సమన్వయం..స్నేహం..వారి ధర్మపత్నులైన లక్ష్మీదేవి, పార్వతీదేవి,సరస్వతీ దేవి స్నేహంతోనే తమ స్నేహబంధంతో రాక్షస సంహారం గావించబడి లోకాలన్నీ శాంతించినాయి.
రాముడు సుగ్రీవుల స్నేహం..రావణ సంహారానికి పలికిన నాంది..
రాముడు,సుగ్రీవుల స్నేహం హరివీర భయంకరుడైన లంకాధీశుడైన రావణుడ్ని సంహరించేలా చేసింది. రామాయణంలో రాముడు,సుగ్రీవుల స్నేహం వాలిని కూడా సంహరించింది. సుగ్రీవుడు అందించిన వానర సైన్యం సహాయంతో రాముడు రావణాసుడ్ని సంహరించాడు. సీతమ్మ చెరను విడిపించాడు. అంతేకాదు సుగ్రీవుడు, రాముడు స్నేహం రావణ సంహారం తరువాత కూడా కొనసాగింది. రాముడి పట్టాభిషేకంలో సుగ్రీవుడు పాలుపంచుకున్నాడు.
friendship day 2023 : నిజమైన స్నేహితులు ఎలా ఉండాలో చెప్పిన మానసిక తత్వవేత్త .. మీరు అలా ఉన్నారా..?
దశరథుడు, జటావులు స్నేహం..రావణ సంహారానికి దారి..
అంతేకాదు సీతమ్మను రావణుడు ఎత్తుకుపోతుండగా జటాయువు అనే పక్షి అడ్డుపడింది.అప్పుడు రావణుడు జటాయువు రెక్కలు నరికివేశాడు. కానీ ప్రాణాలు ఉగ్గపట్టుకుని సీతమ్మ కోసం వెతుకుతు వస్తున్న రాముడు కోసం వేచి చూసింది.రాముడు కంటపడగానే సీతమ్మను రావణుడు ఎత్తుకుపోయాడని అతను లంకకు అధిపతి అని చెప్పింది. సీతమ్మను చేరటానికి దారి చెప్పింది జటాయువు. అంతేకాదు నిలువెల్లా గాయలతో కాసేపటికి చనిపోయే సమయంలో రాముడి జటాయువు ఓ విషయాన్ని తెలిపింది.అదేమంటే రాముడితో జటాయువు మాట్లాడుతు ‘‘నాయనా నేను మీ తండ్రికి స్నేహితుడను’ అని పరిచయం చేసుకుంది. తండ్రికి ఇచ్చిన మాటతో వనవాసం కారణంగా అయోధ్యలో తండ్రి దశరధుడికి అగ్ని సంస్కారానికి నోచుకోని శ్రీరాముడు.. అడవిలో జటాయువుకు భక్తి శ్రద్దలతో అంత్యక్రియలు నిర్వహించాడు. తండ్రి స్నేహితుడిలో తండ్రిని చూసుకున్నాడు శ్రీరాముడు. పక్షి పట్ల కృతజ్ఞతాభావంతో పాటు పితృభావంతో తన కర్తవ్యం నిర్వహించాడు. అలా రావణుడు జాడ చెప్పి ప్రాణాలు వదలిని జటాయువు రాముడి తండ్రి స్నేహితుడు రాముడికి రావణ సంహారానికి దారిచూపించి ప్రాణాలు వదిలింది.
రాముడు ఆంజనేయుల స్నేహం..భక్తి బంధంగా మారిన అపురూం కావ్యం..
అలాగే రామాయణంలో శ్రీరామునికి, ఆంజనేయునికి మధ్య ఉన్న స్నేహబంధం లతలా పెనవేసుకుపోయి భక్తిబంధంగా రూపుదాల్చింది. యుగయుగాలలో భగవంతుడు స్నేహబంధం విలువను ఏదో ఒక రూపంలో మనుషులకు సూచిస్తునే ఉన్నాడు. సీతమ్మను రావణుడు అపహరించాక రాముడు హనుమంతుల పరిచయం అవుతుంది.రాముడి కోసం వేచి చూస్తున్న హనుమంతుడికి రామలక్ష్మణులు కలవటం ఆ తరువాత వారి స్నేహం..రాముడిలో గొప్పలక్షణాలు..హనుమంతుడని రాముడికి భక్తుడిగా మార్చేశాయి…అలా హనుమంతుడు లేని రాముడ్ని..రామయణాన్ని ఊహించలేం..
మహిషాసురుడ్ని సంహరించిన దుర్గాదేవి..దేవతల సహాకారం
అలాగే ఆది పరాశక్తి, అమ్మల గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన దుర్గాదేవి మహిషాసురుడు అనే అతి శక్తివంతమైన రాక్షసుడ్ని సంహరించింది. దుష్ణశిక్షణకు ప్రతీకగా..చెడుపై మంచి సాధించని విజయంగా విజయదశమి పండును నవరాత్రులగా జరుపుకుంటున్నాం. అటువంటి మహిషాసురుడ్ని దుర్గాదేవి సంహరించటానికి దేవతలు అంతా ఒక్కటిగా వారి వారి అస్త్ర శస్త్రాలను అమ్మవారికిసమర్పించారు. అలా వారి బాధ్యతగా భావించారు. లోకాలు సుభిక్షంగా ఉంటానికి ఒక్క రాక్షసుడ్ని సంహరించటానికి దేవతలంతా తమ తమ అస్త్ర శస్త్రాలను ఆ ఆదిశక్తికి సమర్పించారు.అది దేవతల మధ్య ఉండే సమన్వయం..బాధ్యతే కాదు స్నేహం అని కూడా చెప్పుకోవాలి.
పేదా గొప్పలకు అతీతం శ్రీకృష్ణుడు కుచేల స్నేహం..
ద్వాపరయుగంలో కూడా శ్రీకృష్ణుడుకి ఇష్టుడైన చెలికాడు కుచేలుడు. చిన్ననాట కలిసి మెలిసి ఆడుకున్నాడు. ఎన్నో చిలిపిపనులు చేశారు. కమిలిని నిలువెత్తు నిదర్శనంగా శ్రీకృష్ణుడు ఉంటే లేమికి కటిక దరిద్రానికి నిర్వచనంగా కుచేలుడు ఉన్నాడు. అలా చిన్ననాటి చెలికాడు పిడికెడు అటుకులు తెస్తే వాటిని ఇవ్వటానికి కూడ పేద స్నేహితుడు సందేహిస్తే ఎంతో ఇష్టంగా..ప్రాణస్నేహితుడు ఇచ్చిన పిడికెడు అటుకులు తిని అతనికి శిరిసంపదనలు ఇచ్చాడు ఆ శ్రీకృష్ణుడు. అలా వారి స్నేహం పేద గొప్పలకు అతీతంగా నిలిచింది.
ఇచ్చిన మాట కోసం చరిత్రలో నిలిచిపోయిన స్నేహం..ధుర్యోధనుడు, మానసపుత్రుడు కర్ణుల స్నేహం
మహాభారతంలో మానధనుడు, రారాజు ధుర్యోధనుడు, మానసపుత్రుడు కర్ణుడు మధ్యనున్న స్నేహం చరిత్రలో నిలిచిపోయింది. వారిస్నేహం వెలకట్టలేనిది. స్నేహితుని కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టి కర్ణుడు చరిత్రలో నిలిచిపోయాడు. ధర్మయుద్ధంలో కౌరవులు పక్షాన నిలిచిన కర్ణుడు తను చేసేది ధర్మం కాదని తెలిసినా పదిమందిలో తన పరువు నిలిపిన స్నేహితుడు ధుర్యోధనుడు పక్కనే నిలిచాడు. చరిత్రలో తనపేరుకు మలినం అంటుతుందని తెలిసినా తన స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం తన ప్రాణాల్నే పణంగా పెట్టిన గొప్ప స్నేహితుడు కర్ణుడు.
friendship day 2023 : కోపం నీటిమీద రాత అయితే .. చెలిమి శిలమీద రాత అవుతుంది ..
దుష్ణచతుష్టంలో ఒక్కడిగా పేరుగాంచినా..దాన కర్ణుడిగా పేరొంది సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడికే దాతగా మారినా.. యుద్ధంలో మరణించి స్వర్గానికే వెళ్లాడు కర్ణుడు. ఎందుకంటే అతని స్నేహంలో కల్మషం లేదు. ఇచ్చిన మాటకు కట్టుబడిన నిజాయితీ మాత్రమే ఉంది. దుర్యోధనుడు రాజ్యం కోసం అధర్మ యుద్ధానికి పాల్పడ్డాడని..దుర్మార్గుడుగా చరిత్రలో నిలిచిపోయినా కర్ణుడితో అని చేసిన స్నేహంలో ఎటువంటి గర్వంలేదు. ఎటువంటి దర్పం లేదు. ఎటువంటి కల్మషం లేదు. అందుకే ధుర్యోధనుడు,కర్ణుడు మధ్య స్నేహం చరిత్రలో నిలిచిపోయింది.
ఇలా చెప్పు కుంటూ పోతే స్నేహబంధం ఒక నిరంతర గంగా ప్రవాహం… దానిని అదుపు చేయడం గంగ వెల్లువను కమండలంలో పట్టివుంచి నట్లవుతుంది…