Mary Zelmer
అమెరికాకు చెందిన పర్ల్ మేరీ జెల్మర్ రాబిన్సన్ అనే మహిళ ప్రపంచంలోనే అతిపెద్ద నోరు ఉన్న మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరును నమోదు చేసుకున్నారు. ఆమె నోరు చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి, ఒక పెద్ద బర్గర్‌ను కూడా ఒకేసారి తన నోటిలో పెట్టుకుంటుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
పర్ల్ నోరు 7.59 సెంటీమీటర్లు (2.98 అంగుళాలు) ఉంటుంది. తన నోట్లో 10 ప్యాటీలు ఉన్న బర్గర్‌ను ఒకేసారి పెడుతుంది. దీంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఆమె సొంతమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద నోరు ఉన్న మహిళగా పర్ల్ నోటిని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారికంగా గుర్తించింది.
గతంలో ఈ రికార్డు అమెరికాకు చెందిన సామంతా రామ్‌స్డెల్ అనే మహిళ పేరిట ఉండేది. 2021లో ఆమె నోటి విస్తీర్ణం 2.56 అంగుళాలుగా గిన్నిస్ బుక్ గుర్తించింది. ఇప్పుడు ఆమె రికార్డును పర్ల్ బద్దలు కొట్టింది.
పురుషులు, మహిళలు తమ నోటి వెడల్పును చూపించే వీడియోలను ఒక రోజు పర్ల్ ఆన్‌లైన్‌లో చూసింది. తన నోరు కూడా చాలా పెద్దదని ఆమె గ్రహించి ఆశ్చర్యపోయింది. అమ్మాయిలకు కూడా ఇలాంటి రికార్డు ఉంటుందా? అన్న సందేహం వచ్చింది. తాను కూడా ఈ రికార్డు కోసం ప్రయత్నించొచ్చని ఆలోచన ఆమెకు వచ్చింది.
“నా నోరు శారీరకంగా పెద్దదే. నేను నా నోట్లో సుమారు మూడు నరుపు జెంగా బ్లాక్స్ వేసుకుంటాను. నా దవడ ప్రత్యేకమైన నిర్మాణంతో చాలా పెద్దదిగా ఉంటుంది” అని పర్ల్ చెప్పారు. తన నోరు పెద్దగా ఉండడంతో తనను కొందరు ఎగతాళి చేసేవారని ఇప్పుడు ఆ నోరే తనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టిందని ఆమె అంటోంది.