Israel Hamas Conflict: ఇజ్రాయెల్-హమాస్ మధ్య అతిపెద్ద డీల్.. రేపే ఆగిపోనున్న యుద్ధం

విడుదల చేయాల్సిన బందీల జాబితాను ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్‌కు అందజేసినట్లు మజీద్ అల్ అన్సారీ చెప్పినట్లు సమాచారం. అన్ని పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి

Israel Hamas Conflict: ఇజ్రాయెల్-హమాస్ మధ్య అతిపెద్ద డీల్.. రేపే ఆగిపోనున్న యుద్ధం

ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించి ఖతార్ గురువారం పెద్ద ప్రకటన చేసింది. రేపు అంటే శుక్రవారం నవంబర్ 24 నుంచి కాల్పుల విరమణ ప్రారంభమవుతుందని ఖతార్ తెలిపింది. ఆ సాయంత్రానికి బందీలను విడుదల చేయనున్నట్లు పేర్కొంది.

శుక్రవారం ఉదయం 7 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) కాల్పుల విరమణ ప్రారంభమవుతుందని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మజేద్ అల్ అన్సారీ తెలిపారు. ఆ తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) బందీలను విడుదల చేస్తారు. ఇందులో చిన్నారులు, మహిళలు సహా 13 మందిని విడుదల చేయనున్నారు.

విడుదల చేయాల్సిన బందీల జాబితాను ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్‌కు అందజేసినట్లు మజీద్ అల్ అన్సారీ చెప్పినట్లు సమాచారం. అన్ని పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. దీంతో అక్టోబర్ 7న ఇజ్రాయెల్, హమాస్ మధ్య మొదలైన యుద్ధానికి తొలిసారి విరామం లభించనుంది. వాస్తవానికి, ఒప్పందం ప్రకారం కాల్పుల విరమణ గురువారం నుండే ప్రారంభం కావాలి. కానీ అది జరగలేదు.

ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పందంలో ఏముంది?
ఇజ్రాయెల్-హమాస్ నాలుగు రోజుల తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఒప్పందం ప్రకారం.. 150 మంది పాలస్తీనా ఖైదీల విడుదలకు బదులుగా 50 మంది బందీలను విడుదల చేస్తామని హమాస్ హామీ ఇచ్చింది.