Mikheil Saakashvili
Mikheil Saakashvili : ఎన్నికల్లో మోసపూరితంగా గెలిచాడనే ఆరోపణలపై జార్జియా అధ్యక్షడు సాకాష్విలిని అక్టోబర్ 1న అరెస్ట్ చేశారు అధికారులు. దీంతో ఆ దేశంలో రాజకీయ సంక్షోభం నెలకొంది. జైలులో ఉన్న సాకాష్విలి గత 39 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నాడు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
చదవండి : Georgia : బెడ్ కింద 18 పాములు. అది చూసి కేకలు వేసిన మహిళ
ఇక ఇదిలా ఉంటే జైలు సిబ్బంది తనను హింసిస్తున్నారని, తనపై దాడి చేస్తున్నారని, ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారని జుట్టుపట్టుకుని లాక్కెళ్లారని తన లాయరుకు రాసిన లేఖలో పేర్కొన్నాడు సాకాష్విలి. అంతేకాక అనారోగ్యంగా ఉన్న తనను జైలు ఆస్పత్రికి తీసుకెళ్లారని.. అక్కడ తనను చంపడమే వారి లక్ష్యమని సాకాష్విలి లేఖలో రాసుకొచ్చారు.
కాగా సాకాష్విలి 2004-2013 వరకు జార్జియా అధ్యక్షుడిగా పని చేశారు. ఎన్నికల్లో మోసం చేశారనే ఆరోపణల నేపథ్యంలో అక్టోబర్ 1న అరెస్టై జైలులో ఉన్నారు. ఇక సాకాష్విలి రాసిన లేఖ జార్జియాలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ క్రమంలో హక్కుల కార్యకర్తలు జైలు బయట కూర్చొని అధికారుల తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. దాదాపు 50 వేల మంది నిరసలో పాల్గొని.. సాకాష్విలికి మద్దతు తెలిపారు. ఆయనను విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు.
చదవండి : George W. Bush : అఫ్ఘానిస్తాన్ లో నాటో దళాల ఉపసంహరణ అనాలోచిత చర్య – బుష్
ఇక సోమవారం ఉదయం, సాకాష్విలిని పరీక్షించిన వైద్యులు ఆయన శరీరంలో అనేక అవయవాలు పని తీరు ఇప్పటికే నెమ్మదించిందని.. నిరాహాదర దీక్ష మరి కొంత కాలం కొనసాగితే.. ఆయన ప్రాణాలకే ప్రమాదం అని ఆందోళన వ్యక్తం చేశారు. ,నిరాహార దీక్ష మానుకోవాలని మాజీ అధ్యక్షుడికి సూచించినట్లు వైద్యులు తెలిపారు.