వాలెంటైన్స్ డే : జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ ప్రేమ కథ

  • Published By: veegamteam ,Published On : February 13, 2019 / 09:04 AM IST
వాలెంటైన్స్ డే : జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ ప్రేమ కథ

Updated On : February 13, 2019 / 9:04 AM IST

ఢిల్లీ : నియంత చరిత్రలు వెన్నులో వణుకును పుట్టిస్తాయి. వారి తీసుకున్న కఠినమైన..దారుణమైన నిర్ణయాలకు లక్షల ప్రాణాల్లో గాల్లో కలిసిపోయిన సందర్భంగా గుర్తుకొస్తే చాలు ఒళ్లు జలదరిస్తుంది. రక్తపుటేరులు పారించి..మారణహోమాల కళ్లముదుకు కదలాడతాయి. అంతటి నియంతలు కూడా ఓ సాధారణ మనుషులే కదూ..వారికి కూడా ప్రేమించే హృదయం ఉంటుందంటే నమ్మశక్యం కాదు..దేశానికి రాజైనా..తల్లికి బిడ్డే..అలాగే నియంతలైనా కాంతలపై ప్రేమను కురిపించే వలరాజులే. నియంతలలో మరొక కోణం ప్రేమ కోణం.  వారు ప్రేమించిన ఇష్టసఖుల ప్రేమ కోసం అతి సాధారణ తపించి పోయారు. కోరుకున్న మనసుని గెలవలేక కొందరు, గెలుచుకున్న మనిషితో బతకలేక మరికొందరు భగ్నప్రేమికులుగానే మిగిలిపోయారు. వారిలో ఒకరు జర్మన్ నియంతగా పేరొందిన హిట్లర్. అడాల్ఫ్ హిట్లర్. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా జర్మన్ నియంత హిట్లర్ ప్రేమ కథ గురించి తెలుసుకుందాం..
 

జర్మనీయులే ప్రపంచాన్ని ఏలేందుకు అర్హులని భావించిన హిట్లర్‌ మారణహోమానికి నాంది పలికాడు. చేతులకు రక్తపు మరకలవుతున్నా…హిట్లర్‌ మనసులో మాత్రం ప్రేమ గులాబీలు గుభాళిస్తుండేవి. తనకంటే 23 ఏళ్లు చిన్న వయస్సున్న ‘ఈవా బ్రౌన్’పై మనసు పడ్డాడు మన నియంత హిట్లర్‌. ఈవాకి కూడా హిట్లర్‌ అంటే పిచ్చి. హిట్లర్‌కి సంబంధించి ఎన్నో ఫొటోలు ఈవా తీసినవే. యుద్ధంలో హిట్లర్‌కి రోజులు దగ్గరపడుతున్నాయని తెలిసిన ఈవా..ఆగమేఘాల మీద బెర్లిన్  చేరుకుంది. ఇక్కడుంటే నీక్కూడా ప్రమాదం సేఫ్టీ ప్లేస్ కు వెళ్లిపోమ్మమని హిట్లర్ హెచ్చరించినా ఇవా వినలేదు. హిట్లర్‌ ఉంటున్న బంకర్‌ సాక్షిగా..ఆయనను వివాహం చేసుకుంది. ఆ పెళ్లయిన మర్నాడే వాళ్లిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. 

ఇవాను కలిసిన హిట్లర్ 
హిట్లర్ కు 40 ఏళ్ల వయస్సులో ఇవా ను కలిశాడు. అప్పటికి ఇవాకు  17ఏళ్ల వ‌యసు. ఫోటోగ్ర‌ఫీ అసిస్టెంట్‌గా ప‌నిచేసేది. మొద‌టిచూపులోనే హిట్లర్ ప్రేమ‌లో ప‌డిపోయింది. ఇవా ఫ్యామిలీ వీళ్ల అనుబంధానికి ఒప్పుకోలేదు. త‌న ప్రేమ జీవితాన్ని ప్ర‌పంచానికి బ‌హిర్గ‌తం చేయాల‌ని ఆలోచన హిట్ల‌ర్‌కు ఏనాడు లేదు. కేవ‌లం దేశాన్ని ప్రేమించే వ్య‌క్తిగానే మాత్రమే సమాజానికి క‌నిపించాల‌నుకునేవాడు. తన కుటుంబాన్ని ఎదిరించి తనతో అనుబంధాన్ని పెంచుకున్న ఇవా ను హిట్లర్  ప్రాణసమానంగా ప్రేమించాడట. అందుకే చివరి రోజుల్లో ప్రమాదంలో ఉన్నానని తెలిసి కూడా వివాహం చేసుకున్నాడు జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్. ఎంతటివారైనా ప్రేమకు అతీతులు కాదని హిట్లర్ ప్రేమ గురించి తెలిస్తే అనిపించకమానదు.