World’s 3rd Biggest Economy : జపాన్‌ను అధిగమించి ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా జర్మనీ.. అతి త్వరలోనే భారత్ కూడా..!

World 3rd Biggest Economy : ఊహించని విధంగా జపాన్ ఆర్థిక మాంద్యంలోకి జారుకుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తన స్థానాన్ని చేజార్చుకుంది. ఇప్పుడు జపాన్ స్థానాన్ని జర్మనీ దక్కించుకుంది. ఫలితంగా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.

World 3rd Biggest Economy : ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జపాన్ ఒక్కసారిగా తన స్థానాన్ని కోల్పోయింది. ఇప్పుడు ఆ జపాన్ స్థానాన్ని జర్మనీ దక్కించుకుంది. దాంతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా జర్మనీ నిలిచింది. దాదాపు 14ఏళ్ల పాటు జపాన్ మూడో స్థానాన్ని కాపాడుకుంటూ వస్తోంది. ఉన్నట్టుండి ఇప్పుడు నాల్గో స్థానానికి దిగజారిపోయింది. దీనికి ప్రధాన కారణం ఆర్థిక మాంధ్యమే.. గత ఏడాది జపాన్ ఆర్థిక వ్యవస్థ డాలర్ పరంగా ప్రపంచంలో నాల్గవ-అతిపెద్ద స్థాయికి పడిపోయింది.

Read Also : Vivo V30 Pro Launch : ఈ నెల 28నే వివో V30 ప్రో ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక స్పెషిఫికేషన్లు లీక్!

ఈ క్రమంలోనే జపాన్‌‌ను అధగమించి మూడో స్థానంలో జర్మనీ నిలిచింది. లేటెస్ట్ గణాంకాల ప్రకారం.. గత ఏడాదిలో జపాన్ ఆర్థిక వ్యవస్థ 1.9 శాతం జీడీపీ వృద్ధిని నమోదు చేయగా.. జర్మనీ 4.4 ట్రినియన్ డాలర్ల జీడీపీ వృద్ధిని నమోదు చేసింది. దేశ జనాభాలో పిల్లల సంఖ్య తగ్గడంతో పాటు వృద్ధుల సంఖ్య పెరగడమే జపాన్ ఆర్థిక వ్యవస్థ క్షీణించడానికి దారితీసిందని తాజా గణాంకాలు సూచిస్తున్నాయి.

జపాన్ కన్నా నాలుగింతలు బలంగా చైనా :
అందులోనూ జపాన్ కరెన్సీ యెన్ విలువను డాలర్‌తో పోలిస్తే.. అత్యంత దారుణంగా పతనం కావడం ఆ దేశ ఆర్థిక పరిస్థితిని మరింత బలహీనపడింది. జపాన్ కరెన్సీ విలువ 2022లో దాదాపు 20 శాతం క్షీణించింది. 2023 ఏడాదిలో 7 శాతంగా క్షీణించింది. గతంలో అమెరికా ఆర్థిక వ్యవస్థకే సవాల్ విసిరిన జపాన్‌ ఆర్థిక మాంధ్యంతో అల్లాడిపోతోంది. 1990 నుంచి జపాన్ ఆర్థిక వ్యవస్థ క్రమంగా క్షీణిస్తూ వస్తోంది.

2010 వరకు జపాన్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేది. కానీ, డ్రాగన్ చైనా జపాన్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. అలా పైకి ఎగబాకుతూ చైనా ఇప్పుడు జపాన్ కన్నా నాలుగింతలు బలంగా మారింది. మూడో స్థానంలో ఉండాల్సిన జపాన్ ఇప్పుడు ఆ స్థానాన్ని కూడా కోల్పోయింది. ఫలితంగా మూడు నుంచి నాల్గో స్థానానికి దిగజారిపోయింది.

త్వరలోనే మూడో స్థానంలోకి భారత్? :
గతకొద్దికాలంగా భారత్ ఆర్థిక వ్యవస్థ బలపడుతూ వస్తోంది. ఇదే జోరు కొనసాగితే రానున్నరోజుల్లో భారత్ జర్మనీ, జపాన్ దేశాలను కూడా అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జర్మనీని కూడా వెనక్కి నెట్టేసి మూడో స్థానంలోకి భారత్ ఎగబాకే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొదటి రెండు స్థానాల్లో అమెరికా, చైనా కొనసాగుతుండగా.. తాజాగా జర్మనీ మూడో స్థానంలో నిలిచింది. నాల్గో స్థానాన్ని జపాన్ సరిపెట్టుకుంది.

ప్రస్తుతానికి ఈ దేశాల తర్వాత భారత్ ఐదో ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. జర్మనీలోనూ ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. దేశంలో ధరలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. ఫలితంగా దేశ ఆర్థిక వృద్ధి క్రమంగా క్షీణిస్తోంది. ఈ రెండు దేశాల్లోని జనాభాలో వృద్ధుల సంఖ్య పెరగడం ఒక కారణమైతే.. సహజ వనరులు తగ్గడం మరో కారణంగా చెప్పవచ్చు.

కొన్ని గణాంకాల ప్రకారం.. భారత్ వచ్చే 2026 నాటికి జపాన్ స్థానాన్ని దక్కించుకోనుంది. ఆ తర్వాత 2027లో జర్మనీ మూడో స్థానాన్ని భారత్ అందుకోనుందని అంచనా. ఆర్థిక పరిస్థితులను పరిశీలిస్తే.. జర్మనీ, జపాన్‌ను అతికొద్దికాలంలోనే భారత్ అధిగమించే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read Also : Tata Tiago EV Price Drop : టాటా టియాగో ఈవీ కార్లపై భారీ డిస్కౌంట్.. గరిష్టంగా రూ.70వేల వరకు తగ్గింపు.. కొత్త ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు