Tata Tiago EV Price Drop : టాటా టియాగో ఈవీ కార్లపై భారీ డిస్కౌంట్.. గరిష్టంగా రూ.70వేల వరకు తగ్గింపు.. కొత్త ధర ఎంతంటే?

Tata Tiago EV Price : ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా? మీకో గుడ్ న్యూస్.. టాటా టియాగో ఈవీ కార్ల ధరలు తగ్గాయి. ఈవీ కారు కొనుగోలుపై గరిష్టంగా రూ.70వేల వరకు ఆదా చేసుకోవచ్చు. ఏ వేరియంట్‌పై ఎంతవరకు డిస్కౌంట్ పొందొచ్చుంటే?

Tata Tiago EV Price Drop : టాటా టియాగో ఈవీ కార్లపై భారీ డిస్కౌంట్.. గరిష్టంగా రూ.70వేల వరకు తగ్గింపు.. కొత్త ధర ఎంతంటే?

Tata Tiago EV Price drops by up to Rs 70k in India

Tata Tiago EV Price Drop : కొత్త ఎలక్ట్రిక్ కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రముఖ ఆటోమొబైల్ తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఆల్-ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్, టియాగో ఈవీ కార్ల ధరలను భారీగా తగ్గించింది. బ్యాటరీ సెల్స్‌లో ధర తగ్గింపు కారణంగా ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ధర తగ్గిందని కంపెనీ వెల్లడించింది. టాటా ఈవీ కార్ల ధర తగ్గింపుతో టియాగో ఈవీ మోడల్ ధర రూ. 70వేల వరకు తగ్గింది.

Read Also : Tata Motors EV Price Cut : భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల ధరలను భారీగా తగ్గించిన టాటా మోటార్స్.. కొంటే ఇప్పుడే కొనేసుకోండి!

వేరియంట్ల వారీగా ఎంత తగ్గిందంటే? :
ప్రస్తుతం టాటా టియాగో ఈవీ కారు అసలు ధర రూ. 8.69 లక్షలు ఉండగా.. తగ్గింపు తర్వాత భారత మార్కెట్లో రూ.7.99లక్షలకు అందుబాటులో ఉంది. టాటా టియాగో (XT MR) మోడల్ కారు కొనుగోలుపై రూ.35వేలు తగ్గింపు, టాటా టియాగో (XT LR) వేరియంట్‌పై రూ.20వేల తగ్గింపు అందిస్తోంది. టాటా టియాగో వేరియంట్లలో (XZ) ప్లస్ ఎల్ఆర్, ఎక్స్‌జెడ్ ప్లస్ టెక్ లక్స్ ఎల్ఆర్, ఎక్స్‌జెడ్ ప్లస్ ఎల్ఆర్ (7kwh) ఛార్జర్లతో కూడిన వేరియంట్లపై టాటా ఏకంగా రూ.20వేల తగ్గింపును ఆఫర్ చేస్తోంది.

సింగిల్ ఛార్జ్‌పై 315 కిలోమీటర్ల పరిధి :
టియాగో 19.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ని కలిగిన రెండు టియాగో ఈవీ ఎంఆర్ వేరియంట్‌లు అత్యధికంగా రూ.70వేల వరకు ధర తగ్గింపును పొందాయి. టియాగో (24kWh) బ్యాటరీతో ఇతర 5 ఎల్ఆర్ వేరియంట్‌లు రూ. 20వేల వరకు తగ్గాయి. చిన్న బ్యాటరీ ప్యాక్‌తో ఉన్న టాటా టియాగో ఈవీ 250కిమీల (MIDC) పరిధిని అందిస్తుంది. ఈ మోటార్ 61హెచ్‌పి పవర్, 110 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 24కిలోవాట్ ఛార్జర్ కలిగిన టియాగో ఈవీ సింగిల్ ఛార్జ్‌పై 315 కిలోమీటర్లు ప్రయాణించగలదు.

ఫ్రంట్ వీల్స్ కోసం 75హెచ్‌పీ, 114ఎన్ఎమ్ మోటార్‌ను కలిగి ఉంది. టియాగో కార్ల ధర తగ్గినప్పటికీ టాటా టియాగో ఈవీ ధర ఇప్పటికీ ఎంజీ కామెట్ ఈవీ కన్నా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యంత సరసమైన ఆల్-ఎలక్ట్రిక్ కారు ఇదే. ఎంజీ కామెట్ ఈవీ ఇటీవల దేశంలో రూ. 1.4 లక్షల వరకు ధర తగ్గింపును అందుకుంది. ఇప్పుడు, భారత్‌లో ఈవీ కారు ధర రూ. 6.99 లక్షల నుంచి రూ.8.58 లక్షల మధ్య ఉంది.

Read Also : Honor X9b Launch in India : 108ఎంపీ కెమెరాతో హానర్ X9b ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. భారత్‌లో ధర ఎంతంటే?