Honor X9b Launch in India : 108ఎంపీ కెమెరాతో హానర్ X9b ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. భారత్‌లో ధర ఎంతంటే?

Honor X9b Launch in India : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? హానర్ నుంచి సరికొత్త X9b ఫోన్ లాంచ్ అయింది. 108ఎంపీ కెమెరాలతో ఆకర్షణీయమైన స్టోరేజీ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ధర, ఫీచర్లు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Honor X9b Launch in India : 108ఎంపీ కెమెరాతో హానర్ X9b ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. భారత్‌లో ధర ఎంతంటే?

Honor X9b With 108-Megapixel Camera, Snapdragon 6 Gen 1 Launched

Honor X9b Launch in India : కొత్త ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లోకి స్మార్ట్‌ఫోన్ తయారీదారు హానర్ నుంచి సరికొత్త ఫోన్ వచ్చేసింది. హానర్ ఎక్స్9బీ కొత్త ఫోన్ ఫిబ్రవరి 15న లాంచ్ అయింది. ఈ సరికొత్త ఎక్స్-సిరీస్ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్‌తో 4ఎన్ఎమ్ స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 చిప్‌తో పనిచేస్తుంది. 6.78-అంగుళాల కర్వడ్ అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. 108ఎంపీ ప్రైమరీ కెమెరాను కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఈ ఫోన్ 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో 35డబ్ల్యూ వైర్డు ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది. ఐపీ53 రేటింగ్‌ను కూడా కలిగి ఉంది.

Read Also : Buy Smartphone 2024 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? వచ్చే జూన్‌‌లోగా కొనేసుకోండి.. ఎందుకో తెలుసా?

భారత్‌లో హానర్ X9b ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో హానర్ ఎక్స్9బీ ఫోన్ ధర రూ. 25,999కు పొందవచ్చు. ఈ ఫోన్ 8జీబీ+256జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ను మిడ్‌నైట్ బ్లాక్, సన్‌రైజ్ ఆరెంజ్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు. కంపెనీ ప్రకారం.. హానర్ X9b ఫోన్ మొదటిసారిగా ఫిబ్రవరి 16న మధ్యాహ్నం 12 గంటలకు (మధ్యాహ్నం) విక్రయానికి అందుబాటులో ఉండనుంది. అమెజాన్ దేశవ్యాప్తంగా 1,800 రిటైల్ స్టోర్ల ద్వారా ఈ ఫోన్ విక్రయించనుంది. వినియోగదారులు ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి రూ.3వేల తగ్గింపుతో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు.

హానర్ X9b స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
డ్యూయల్ సిమ్ (నానో) హానర్ X9b పైన మ్యాజిక్ ఆపరేటింగ్ సిస్టమ్ 7.2తో ఆండ్రాయిడ్ 13లో రన్ అవుతుంది. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల 1.5K (1,200×2,652 పిక్సెల్‌లు) కర్వడ్ అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. అల్ట్రా-బౌన్స్ యాంటీ డ్రాప్ డిస్‌ప్లే టెక్నాలజీ 1.2 రెట్లు డ్రాప్ ఇంపాక్ట్‌ను కలిగి ఉందని కంపెనీ తెలిపింది. 8జీబీ ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్‌తో పాటు క్వాల్‌కామ్ 4ఎన్ఎమ్ స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 చిప్‌తో రన్ అవుతుంది.

ఫోటోలు, వీడియోలకు హానర్ ఎక్స్9బీలో ఎఫ్/1.75 ఎపర్చరుతో 108ఎంపీ ప్రైమరీ కెమెరా, ఎఎఫ్/2.2తో 5ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా, ఎఫ్/2.4 ఎపర్చర్‌తో 2ఎంపీ మాక్రో కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం 16ఎంపీ కెమెరాను కలిగి ఉంది. హానర్ X9b ఫోన్‌లో 256జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీని పొందవచ్చు.

కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, 4జీ ఎల్‌టీఈ, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం హ్యాండ్‌సెట్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. 5,800ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. 35డబ్ల్యూ వైర్డు ఛార్జింగ్‌కు సపోర్టుతో మూడు రోజుల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుందని పేర్కొంది. హానర్ ఎక్స్9బీ నిరోధకత కోసం ఐపీ53 రేటింగ్‌ను కలిగి ఉంది. కంపెనీ ప్రకారం.. 7.98ఎమ్ఎమ్ మందం, 185గ్రాముల బరువు ఉంటుంది.

Read Also : Poco Smartphones India : గ్రీన్ కలర్ వేరియంట్‌తో పోకో ఎం6 5జీ, పోకో సి65 ఫోన్లు.. భారత్‌లో ధర ఎంతో తెలుసా?