Poco Smartphones India : గ్రీన్ కలర్ వేరియంట్‌తో పోకో ఎం6 5జీ, పోకో సి65 ఫోన్లు.. భారత్‌లో ధర ఎంతో తెలుసా?

Poco Smartphones India : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు పోకో నుంచి పోకో ఎం6 5జీ, పోకో సి65 ఫోన్లు గ్రీన్ కలర్ వేరియంట్‌తో వచ్చేశాయి. ధర ఎంతంటే?

Poco Smartphones India : గ్రీన్ కలర్ వేరియంట్‌తో పోకో ఎం6 5జీ, పోకో సి65 ఫోన్లు.. భారత్‌లో ధర ఎంతో తెలుసా?

Poco M6 5G And C65 Green Colour Variant Unveiled in India

Updated On : February 14, 2024 / 7:38 PM IST

Poco Smartphones India : కొత్త ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లోకి చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు పోకో నుంచి కొత్త పోకో సిరీస్ ఫోన్లు వచ్చేశాయి. గత ఏడాది డిసెంబర్‌లో దేశంలో పోకో ఎం6 5జీ, పోకో సి65 స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. ఇప్పుడు, షావోమీ సబ్-బ్రాండ్ దేశంలో కొత్త గ్రీన్ కలర్ ఆప్షన్‌లో హ్యాండ్‌సెట్‌లను అందుబాటులోకి తెచ్చింది.

Read Also : Hero Mavrick 440 Launch : మూడు వేరియంట్లలో కొత్త హీరో మావ్రిక్ 440 బైక్ వచ్చేసింది.. ధర ఎంత? డెలివరీలు ఎప్పటినుంచంటే?

పోకో ఎం6 5జీ, పోకో సి65 లేటెస్ట్ కలర్ వేరియంట్‌లు ఫ్లిప్‌కార్ట్‌లో త్వరలో అమ్మకానికి రానున్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ఎస్ఓసీ పోకో ఎం6 5జీకి పవర్ అందిస్తుంది. అయితే, పోకో సి65 5జీ ఫోన్ మీడియాటెక్ హెలియో జీ85 చిప్‌సెట్‌పై నడుస్తుంది. ఈ రెండు మోడళ్లకు 18డబ్ల్యూ వైర్డు ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీ యూనిట్‌లు ఉన్నాయి.

భారత్‌లో పోకో ఫోన్ల ధర ఎంతంటే? :
పోకో ఎం6 5జీ ఫోన్, పోకో సి65 గ్రీన్ కలర్ వేరియంట్‌లు త్వరలో ఫ్లిప్‌కార్ట్ ద్వారా భారత మార్కెట్లో విక్రయానికి అందుబాటులో ఉండనున్నాయి. పోకో సి65 ఇప్పుడు మ్యాట్ బ్లాక్, పాస్టెల్ బ్లూ, పాస్టెల్ గ్రీన్ అనే మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. పోకో ఎం6 5జీ కొత్త పొలారిస్ గ్రీన్ కలర్ ఆప్షన్ గత ఏడాది డిసెంబర్‌లో లాంచ్ అయింది. భారత్‌లో ఇప్పటికే గెలాక్టిక్ బ్లాక్, ఓరియన్ బ్లూ వేరియంట్‌ ఆప్షన్లు కూడా ఉన్నాయి.

భారత మార్కెట్లో పోకో సి65 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 8,499, అయితే 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్‌ల ధర వరుసగా రూ. 9,499, రూ. 10,999గా ఉన్నాయి. మరోవైపు పోకో ఎం6 5జీ ఫోన్ బేస్ 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 10,499, అయితే 6జీబీ ర్యామ్ + 128జీబీ, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వెర్షన్‌ల ధర వరుసగా రూ. 11,499, రూ. 13,499 నుంచి అందుబాటులో ఉంటాయి.

పోకో M6 5జీ, పోకో సి65 స్పెసిఫికేషన్లు :
పోకో ఎం6 5జీ, పోకో సి65 మోడల్ ఎంఐయూఐ 14తో ఆండ్రాయిడ్ 13లో రన్ అవుతాయి. 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల హెచ్‌డీ+ (720×1,600 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. మీడియాటెక్ డైమన్షిటీ 6100+ చిప్‌సెట్‌తో ఆధారితమైనది. అయితే, మీడియాటెక్ హెలియో జీ85 ఎస్ఓసీ అనేది పోకో సి65కి పవర్ అందిస్తుంది.

పోకో ఎం6 5జీ ఫోన్ 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 8ఎంపీ సెల్ఫీ కెమెరాతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. పోకో సి65లో 50ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, 5ఎంపీ సెల్ఫీ షూటర్ ఉన్నాయి. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు 18డబ్ల్యూ వైర్డు ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉన్నాయి.

Read Also : Honda NX500 Bike Launch : కొత్త బైక్ కొంటున్నారా? దిమ్మతిరిగే ఫీచర్లతో హోండా NX500 అడ్వెంచర్ బైక్.. బుకింగ్స్ ఓపెన్.. ధర ఎంతంటే?