Vivo V30 Pro Launch : ఈ నెల 28నే వివో V30 ప్రో ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక స్పెషిఫికేషన్లు లీక్!

Vivo V30 Pro Launch : కొత్త వివో ప్రో వెర్షన్ వచ్చేస్తోంది. ఈ నెలాఖరున గ్లోబల్ మార్కెట్లో వివో V30 ప్రో మోడల్ లాంచ్ కానుంది. అయితే, అంతకంటే ముందే ఈ కొత్త ఫోన్ కీలక స్పెషిషికేషన్లు లీక్ అయ్యాయి.

Vivo V30 Pro Launch : ఈ నెల 28నే వివో V30 ప్రో ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక స్పెషిఫికేషన్లు లీక్!

Vivo V30 Pro With 50-Megapixel Primary Camera Set to Launch on February 28

Vivo V30 Pro Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు వివో నుంచి సరికొత్త ఫోన్ వచ్చేస్తోంది. షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల (ఫిబ్రవరి) 28న వివో V30 ప్రో మోడల్ లాంచ్ కానుంది. ఇటీవల ప్రామాణిక వివో V30 మోడల్ లాంచ్ చేసిన వారాల తర్వాత ప్రో హ్యాండ్‌సెట్ అందుబాటులోకి రానుంది. ఈ మోడల్ లాంచ్ కావడానికి ముందే వివో ఫోన్ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 3డీ కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని ధృవీకరించింది. అయితే, ఈ హ్యాండ్‌సెట్‌లోని 3 కెమెరాలు జీస్ లెన్స్‌లతో అమర్చబడి ఉంటాయి. అంతేకాదు.. 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుందని కంపెనీ వెల్లడించింది.

Read Also : Vivo Y200e Price : భారత్‌కు వివో Y200e కొత్త ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర, కీలక ఫీచర్లు లీక్..!

వివో వి30 ప్రో.. మొత్తం 3 కలర్ ఆప్షన్లలో.. :
వివో అధికారిక వెబ్‌సైట్‌లో రూపొందించిన ల్యాండింగ్ పేజీ ప్రకారం.. వివో వి30 ప్రో మోడల్ ఫిబ్రవరి 28న థాయ్‌లాండ్‌లో లాంచ్ కానుంది. దేశంలోని కస్టమర్‌లు ఇప్పుడు లాంచ్ సందర్భంగా ఈ హ్యాండ్‌సెట్‌ను ప్రీఆర్డర్ చేయవచ్చు. గ్రీన్ సీ, నైట్ స్కై బ్లాక్, పెర్ల్ వైట్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో ఫోన్ లాంచ్ అవుతుందని కంపెనీ అధికారిక వెబ్‌సైట్ పేర్కొంది.

కంపెనీ ల్యాండింగ్ పేజీలో రాబోయే ఈ హ్యాండ్‌సెట్ గురించి కొన్ని స్పెసిఫికేషన్‌లను కూడా వెల్లడించింది. 50ఎంపీ ప్రైమరీ కెమెరాతో వస్తుంది. మూడు కెమెరాలు జీస్ లెన్స్‌లను కలిగి ఉంటాయి. కెమెరా మాడ్యూల్ కింద ‘ఆరా’ లైట్ ఉంది. వినియోగదారులు ఫొటోలను క్లిక్ చేసేటప్పుడు కలర్ టెంపరేచర్ బట్టి ఎడ్జెట్ చేయవచ్చు.

50ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్ (అంచనా) :
కంపెనీ ప్రకారం.. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 3డీ కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇటీవల టిప్‌స్టర్ లీక్ చేసిన వివరాల ప్రకారం.. వివో వి30 ప్రో 50ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో అమర్చబడి ఉంటుంది. 50ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో కూడా రావచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 80డబ్ల్యూ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

వివో V30 ప్రో స్పెసిఫికేషన్‌లకు అనేక నివేదికలు రివీల్ చేశాయి. డిసెంబర్ 2023లో చైనాలో లాంచ్ అయిన వివో ఎస్18 ప్రో మాదిరిగా ఫీచర్లు ఉన్నాయని సూచిస్తున్నాయి. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్లస్ చిప్‌సెట్‌ కలిగి ఉంది. అంతేకాదు.. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14పై రన్ అవుతుంది. 12ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కూడా ఉన్నాయి.

Read Also : Tata Tiago EV Price Drop : టాటా టియాగో ఈవీ కార్లపై భారీ డిస్కౌంట్.. గరిష్టంగా రూ.70వేల వరకు తగ్గింపు.. కొత్త ధర ఎంతంటే?