×
Ad

German Hamburg airport : హాంబర్గ్ విమానాశ్రయంలో కాల్పులు…విమానాశ్రయం మూసివేత

జర్మనీ దేశంలోని హాంబర్గ్ విమానాశ్రయంలో కాల్పుల కలకలం చెలరేగింది. శనివారం రాత్రి సాయుధుడైన ఓ డ్రైవరు సెక్యూరిటీ కారు నడుపుతూ విమానాశ్రయంలో కాల్పులు జరిపాడు. ఈ కాల్పులతో రాత్రి 8 గంటల సమయంలో విమానాశ్రయంలో అన్ని విమానాల టేకాఫ్‌లు, ల్యాండింగ్‌లు నిలిపివేశారు....

  • Published On : November 5, 2023 / 11:10 AM IST

German Hamburg airport

German Hamburg airport : జర్మనీ దేశంలోని హాంబర్గ్ విమానాశ్రయంలో కాల్పుల కలకలం చెలరేగింది. శనివారం రాత్రి సాయుధుడైన ఓ డ్రైవరు సెక్యూరిటీ కారు నడుపుతూ విమానాశ్రయంలో కాల్పులు జరిపాడు. ఈ కాల్పులతో రాత్రి 8 గంటల సమయంలో విమానాశ్రయంలో అన్ని విమానాల టేకాఫ్‌లు, ల్యాండింగ్‌లు నిలిపివేశారు.

Also Read : Onions : మొబైల్ వాహనాల్లో సబ్సిడీ ఉల్లి విక్రయం…కిలో ధర ఎంతంటే…

ఒక వాహనం భద్రతను ఛేదించి విమానాశ్రయ ప్రాంగణంలోకి ప్రవేశించిన తర్వాత శనివారం రాత్రి విమానాలు రద్దు చేశారు. ప్రయాణికులందరూ ఎయిర్‌పోర్ట్‌ను ఖాళీ చేసి వెళ్లినందున ఇతరులకు హాని జరిగే సూచనలు లేవని పోలీసులు తెలిపారు. డ్రైవరు కారును విమానం కింద నిలిపివేశారు.

Also Read : Khalistani terrorist : నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దు…ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ తాజా హెచ్చరిక

ఈ కాల్పుల ఘటనలో 27 విమానాలు దెబ్బతిన్నాయని విమానాశ్రయ ప్రతినిధి చెప్పారు. పోలీసులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి వచ్చారు. ఈ ఘటనకు కారణాలపై జర్మనీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.