God Bless India: భారత్‌పై టర్కీ వాసుల ప్రశంసలు.. సహాయక సిబ్బందికి కృతజ్ఞతల వెల్లువ.. 46 వేలకు చేరిన మృతుల సంఖ్య

భూకంప శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించడం, వైద్య సహాయం అందించడం, ఔషధాలు, ఆహారం వంటివి పంపిణీ చేయడం లాంటి అనేక పనులు భారత బృందాలు చేపట్టాయి. టర్కీలో భారత బృందాలు చేపట్టిన సహాయక చర్యలు ముగిశాయి. శనివారం భారత బృందం ఇండియా తిరిగొచ్చింది.

God Bless India: రెండు వారాల క్రితం టర్కీ, సిరియాల్లో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. భూకంపం కారణంగా భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. రెండు దేశాల్లో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా భారత సహాయక బృందాలు అక్కడ అవిశ్రాంతంగా పని చేశాయి.

Youngest Organ Donor: తండ్రి కోసం పదిహేడేళ్ల కూతురు త్యాగం.. అతి చిన్న వయసులో లివర్ దానం.. అరుదైన రికార్డు

భూకంప శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించడం, వైద్య సహాయం అందించడం, ఔషధాలు, ఆహారం వంటివి పంపిణీ చేయడం లాంటి అనేక పనులు భారత బృందాలు చేపట్టాయి. టర్కీలో భారత బృందాలు చేపట్టిన సహాయక చర్యలు ముగిశాయి. శనివారం భారత బృందం ఇండియా తిరిగొచ్చింది. అయితే, అక్కడ మనవాళ్లు చేసిన సహాయక చర్యలకు టర్కీ వాసులు కృతజ్ఞతలు చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేపట్టిన సహాయక చర్యలు అక్కడివాళ్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. స్థానికులు భారత్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Delhi-Meerut Expressway: పొగ మంచు కారణంగా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఢీకొన్న వాహనాలు.. పలువురికి గాయాలు

భూకంపం వల్ల తాము దిక్కులేని వాళ్లం అయిపోయామనే భావన కలిగిందని, అయితే, భారత సిబ్బంది తమకు చేసిన సహాయం చూసి మళ్లీ తమలో భద్రతా భావం పెరిగిందని అక్కడి వాళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. ‘గాడ్ బ్లెస్ ఇండియా’ అంటూ ఇండియాపై తమకున్న కృతజ్ఞతను చాటి చెబుతున్నారు. టర్కీలో సహాయక చర్యలు చేపట్టి ఇండియా తిరిగొచ్చిన బృందానికి ఘన స్వాగతం లభించింది. అక్కడ వాళ్లు చేసిన సహాయానికి అంతర్జాతీయంగానూ గుర్తింపు దక్కింది. మరోవైపు టర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంపం కారణంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 46,000కు చేరుకుంది.

టర్కీలో 40,402 మంది మరణించగా, సిరియాలో 5,800 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం అర్ధరాత్రితో సహాయక చర్యల్ని నిలిపివేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. 296 గంటలపాటు సహాయక చర్యలు కొనసాగాయి. భూకంపం వల్ల మూడు లక్షల అపార్ట్‌మెంట్లు ధ్వంసమయ్యాయి.