Delhi-Meerut Expressway: పొగ మంచు కారణంగా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఢీకొన్న వాహనాలు.. పలువురికి గాయాలు

తాజాగా ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ వేపై పొగ మంచు కారణంగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం వేకువఝామున అనేక వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురు వాహనదారులు గాయపడ్డట్లు ఘజియాబాద్ రూరల్ డీసీపీ రవికుమార్ తెలిపారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

Delhi-Meerut Expressway: పొగ మంచు కారణంగా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఢీకొన్న వాహనాలు.. పలువురికి గాయాలు

Delhi-Meerut Expressway: దట్టంగా కమ్ముకున్న పొగ మంచు అనేక రోడ్డు ప్రమాదాలకు కారణమవుతుంది. తాజాగా ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ వేపై పొగ మంచు కారణంగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం వేకువఝామున అనేక వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.

YS Sharmila SC, ST Case : వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిలపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు

ఈ ఘటనలో పలువురు వాహనదారులు గాయపడ్డట్లు ఘజియాబాద్ రూరల్ డీసీపీ రవికుమార్ తెలిపారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఉదయం పొగ మంచు కారణంగా హైవే రోడ్డుపై మొత్తం చీకటి అలుముకుంది. రోడ్డుపై దారి సరిగ్గా కనిపించలేదు. కార్ల హెడ్ లైట్స్ వేసుకున్నా దారి కనిపించలేదు. దీంతో ఒక వాహనం వేగంగా వెళ్లి ఎదురుగా ఉన్న మరో వాహనాన్ని ఢీకొంది. రోడ్డుపై నిలిచిపోయిన ఆ వాహనాన్ని మరో వాహనం ఢీకొంది. ఇలా 15 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.

ఈ ఘటన ఉదయం ఎనిమిది గంటలకు జరగడం విశేషం. ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. అయితే, ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదు. ఒక ట్రక్ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి గురైన వాహనాల్లో స్కూల్ బస్సు కూడా ఉంది. బస్సులోని విద్యార్థులు కూడా గాయపడ్డారు. రోడ్డు ప్రమాదం కారణంగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పోలీసులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. రోడ్డుపై ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.