YS Sharmila SC, ST Case : వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిలపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు

వైఎస్ షర్మిలను మహబూబాబాద్ పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రికత్త నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ దంపతులపై పరుష వ్యాఖ్యలు చేయడంతో షర్మిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

YS Sharmila SC, ST Case : వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిలపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు

Sharmila

YS Sharmila SC, ST Case : మహబూబాబాద్ జిల్లాలో కొనసాగుతున్న వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రలో హైటెన్షన్ నెలకొంది. వైఎస్ షర్మిలను మహబూబాబాద్ పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రికత్త నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ దంపతులపై పరుష వ్యాఖ్యలు చేయడంతో షర్మిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

సాలార్ తండా నైట్ క్యాంప్ వద్ద షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు హైదరాబాద్ కు తరలిస్తున్నారు. షర్మిల పాదయాత్రను రద్దు చేస్తున్నట్లు పోలీసులు నోటీసులు ఇచ్చారు. షర్మిలను ఖమ్మం, సూర్యపేట మీదుగా హైదరాబాద్ కు తరలిస్తున్నారు. షర్మిల అరెస్టుతో ఉద్రికత్త పరిస్థితి నెలకొంది.

YS Sharmila Arrest: వై.ఎస్. షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత.. అరెస్ట్ చేసిన పోలీసులు.. హైదరాబాద్‌కు తరలింపు

అంతకముందు మహబూబాబాద్ మండల బేతోలు శివారులో రాత్రి షర్మిల బస చేశారు. మహబూబాబాద్ పట్టణంలో వైఎస్ షర్మిల మాట.. ముచ్చట కార్యక్రమంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఫై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ షర్మిల క్యాంప్ దగ్గరకి భారిగా ఎమ్మెల్యే వర్గీయులు చేరుకున్నారు. మహబూబాబాద్ _ కురవి జాతీయ రహదారి 365పై భజన తండా వద్ద ఎమ్మెల్యే వర్గీయులు రాస్తారోకో, ధర్నా చేపట్టారు. షర్మిల ఫ్లెక్సీలను ఎమ్మెల్యే వర్గీయులు దగ్ధం చేశారు.