Gold Coins: ఆ రైతు అదృష్టం పండింది.. పొలం దున్నుతుంటే బంగారు నాణాలు బయటపడ్డాయి.. ఎక్కడంటే?
ఓ రైతుకి తన పొలంలో అదృష్టం కలిసి వచ్చింది. పొలం దున్నుతుంటే బంగారు నాణాలు బయటపడ్డాయి. ఇక అతని ఆనందం మాటల్లో చెప్పలేం..

America
Gold Coins – America : అదృష్టం చెప్పిరాదు.. ఒక్కసారిగా తలుపుతడుతుంది. ఓ రైతు పొలం పనులు చేసుకుంటున్నాడు. మట్టి తవ్వుతుంటే భోషాణం పెట్టె బయటపడింది. అందులో ఏముందనుకున్నారు? కళ్లు మిరుమిట్లు గొలిపేలా బంగారు నాణాలు కనిపించాయి. ఇంక అతని లక్ ఏమని చెప్పాలి.
Gold Coins Found : పొలంలో పైపులైన్ తవ్వుతుండగా.. పురాతనకాలం నాటి బంగారు నాణాలు లభ్యం
అమెరికాలోని కెంటుకీ రాష్ట్రంలో ఓ రైతుకి అతని పొలం చెప్పలేనంత అదృష్టం తెచ్చిపెట్టింది. ఎప్పటిలాగే పొలం దున్నుకుంటున్న అతనికి భూమిలో ఏదో అడ్డు పటినట్లు అనిపించింది. ఆత్రంగా తవ్వి చూసాడు. భోషాణం లాంటి పెట్టె బయటపడింది. తెరిచి చూస్తే బంగారు, వెండి నాణాలతో నిండి ఉంది. రైతు ఆశ్చర్యపోయాడు. నిజామా? కాదా? అనే భ్రమలో మునిగిపోయాడు. ఇక తనకి పట్టిన అదృష్టానికి మురిసిపోయాడు.
Titanosaur Eggs: నర్మదా లోయలో తవ్వకాల్లో బయటపడ్డ 256 డైనోసార్ గుడ్లు ..
ఈ నాణాలు అన్నీ 1840-1863 చెందినవిగా చెబుతున్నారు. ఈ నాణాల మీద ‘ఇన్ గాడ్ వి ట్రస్ట్’ అని రాసి ఉందట. ఆ టైంలో అమెరికాలో అంతర్యుద్ధం జరిగింది. దీనిని బట్టి ఆ కాలానివిగా స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఎన్ని బంగారు నాణాలు దొరికాయంటే అక్షరాల 700 గోల్డ్ కాయిన్స్. ఇక వెండి నాణాల సంగతి చెప్పనక్కర్లేదు. ఇక ఈ నాణాలను ఏం చేస్తారు? అనేగా మీ డౌట్. ఆక్షన్‌కి పెట్టారు. ఇక వాటిని నుంచి వచ్చే డబ్బుతో రైతు పంట పండినట్లే.