F-1 Visa: భారత విద్యార్థులకు తీపి కబురు.. మాట నిలబెట్టుకున్న అమెరికా

ఫాల్ సీజన్‭కు సంబంధించి ఢిల్లీలోని అమెరికా ఎంబసీ కార్యాలయంతో పాటు ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నై కాన్సులేట్ కార్యాలయాల్లో విద్యార్థి వీసా ఎఫ్-1 దరఖాస్తుల తతంగం చివరి దశకు చేరుకుంది. ఈ వారం ముగిసేలోపు పూర్తి ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ఇక ఈ దఫా ఇంటర్వ్యూలు ముగిసిన అనంతరం, ఇంతకు ముందు ఇంటర్వ్యూ ఫెయిల్ అయిన విద్యార్థులు మరోసారి ఇంటర్వ్యూకి హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తారు.

Good news to Indian students, America changes F-1 Visa interview

F-1 Visa: ముందుకు చెప్పినట్లుగానే అమెరికా తన మాట నిలబెట్టుకుంది. వీసా ఇంటర్వ్యూలో ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులకు మరోసారి ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తూ అగ్రరాజ్యం అమెరికా తాజాగా నిర్ణయం తీసుకుంది. గతంలో ఒకసారి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే మరోసారి అవకాశం ఉండేది కాదు. అయితే ఈ విషయమై భారతీయ విద్యార్థులు చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చిన జో బైడెన్ ప్రభుత్వం.. ఇచ్చిన మాట ప్రకారమే మరోసారి ఇంటర్వ్యూకి హాజరయ్యేలా మార్పు చేస్తున్నట్లు ప్రకటించింది.

Pragya Singh Thakur: ఇంట్లో కత్తుల్ని పదును చేసి పెట్టుకోండి, ఎందుకంటే.. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ

ఫాల్ సీజన్‭కు సంబంధించి ఢిల్లీలోని అమెరికా ఎంబసీ కార్యాలయంతో పాటు ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నై కాన్సులేట్ కార్యాలయాల్లో విద్యార్థి వీసా ఎఫ్-1 దరఖాస్తుల తతంగం చివరి దశకు చేరుకుంది. ఈ వారం ముగిసేలోపు పూర్తి ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ఇక ఈ దఫా ఇంటర్వ్యూలు ముగిసిన అనంతరం, ఇంతకు ముందు ఇంటర్వ్యూ ఫెయిల్ అయిన విద్యార్థులు మరోసారి ఇంటర్వ్యూకి హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తారు. ఇందులో భాగంగా వచ్చే నెలలో వీసాకు సంబంధించిన ఇంటర్వ్యూ తేదీల స్లాట్లు విడుల చేయాలని అమెరికా నిర్ణయం తీసుకుంది.

Gujarat: ఆన్‭లైన్‭లో కూతురి అసభ్యకరమైన వీడియో.. ప్రశ్నించినందుకు ఆర్మీ జవాన్‭ను‭ కొట్టి చంపారు

గతేడాది నుంచి ఒక సీజన్‭లో ఒక దఫా మాత్రమే ఇంటర్వ్యూ స్లాట్ పొందేలా అమెరికా ప్రభుత్వం మార్పులు చేసింది. దీంతో ప్రత్యేకంగా స్లాట్ విడుదలైతే తప్ప రెండోసారి ఇంటర్వ్యూకి హాజరయ్యే అవకాశం లేకుండా ఉండేది. అయితే ఈసారి ఒకే సీజన్‭లో రెండోసారి ఇంటర్వ్యూకి అవకాశం కల్పిస్తూ అమెరికా నిర్ణయం తీసుకోవడం గమనార్హం.