మీ ఫోన్‌లోనే ‘గూగుల్ ఎర్త్’లో నక్షత్రాలను చూడొచ్చు!

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఎర్త్ మొబైల్ యాప్‌లో కొత్త ఫీచర్ వచ్చింది. మొబైల్ వెర్షన్ గూగుల్ ఎర్త్ యూజర్లు ఈజీగా మన విశ్వంలోని నక్షత్రాలను వైడ్ యాంగిల్ లో చూడొచ్చు. ఇప్పటివరకూ ఈ ఫీచర్ గూగుల్ ఎర్త్ వెబ్ వెర్షన్, ఎర్త్ ప్రో వెర్షన్ లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ ఫీచర్ స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లలో కూడా అందుబాటులోకి వచ్చేసింది.
గూగుల్ ఎర్త్ మొబైల్ యాప్ లో స్టార్ ఇమేజరీ ఫీచర్ యాడ్ చేసింది సెర్చ్ దిగ్గజం. గ్లోబ్ లో కనిపించే ఆకాశమంతా ప్లెయిన్ బ్లాకులో ఉంటుంది. అది చూడటానికి వాస్తవంగా అనిపించదు. ఇప్పుడు.. గూగుల్ ఎర్త్ మొబైల్ వెర్షన్ లో అన్ని మారిపోయాయి. గూగుల్ బ్లాగ్ పోస్టు ప్రకారం.. కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు ఎంతో శక్తివంతమైనవి. ఇలాంటి డివైజ్ ల కోసం నైణ్యతతో కూడిన ఎర్త్ వెబ్, ప్రొ వెర్షన్లను గూగుల్ తీసుకొచ్చింది.
ఈ కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే? :
* గూగుల్ ఎర్త్ యాప్ యూజర్లు.. గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ స్టోర్ లోకి వెళ్లండి.
* మీ గూగుల్ ఎర్త్ యాప్ ఇన్ స్టాల్ అయి ఉంటే.. లేటెస్ట్ వెర్షన్ అప్ డేట్ చేసుకోండి.
* ఇప్పుడు మీ ఫోన్లలో గూగుల్ ఎర్త్ యాప్ ఓపెన్ చేయండి.
* ఇప్పుడు మీరు గ్లోబ్ జూమ్ ఔట్ చేస్తే స్టార్స్ వ్యూ చూడొచ్చు.
* అలాగే ముందుకు వెనక్కి గ్లోబ్ కదిపితే మన అందమైన పాలపుంత, విశ్వాన్ని చూడొచ్చు.
* గ్లోబ్ చుట్టూ యానిమేటెడ్ క్లౌడ్స్ కూడా యాడ్ చేసింది.