ఇక మాదే రాజ్యం.. మాకు అడ్డెవరు.. రోడ్లపై మేకల గుంపు స్వైర విహారం..

  • Published By: srihari ,Published On : May 15, 2020 / 01:21 PM IST
ఇక మాదే రాజ్యం.. మాకు అడ్డెవరు.. రోడ్లపై మేకల గుంపు స్వైర విహారం..

Updated On : May 15, 2020 / 1:21 PM IST

కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. ఈ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ లాక్ డౌన్ తో ప్రజలంతా ఇళ్లకే పరిమితమవడంతో రోడ్లన్నీ ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. దీంతో జంతువులు తమదే రాజ్యం అన్నట్లుగా యథ్యేచ్చగా రోడ్ల పై తిరుగుతూ సంతోషంగా విహరిస్తున్నాయి. తాజాగా కాలిఫోర్నియాలో 200 మేకల గుంపు రోడ్లపై  విహరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కాలిఫోర్నియాలోని సాంజోస్ ప్రాంతంలో కాపరి లేకుండానే రెండు వందల మేకల గుంపు ఒక ఇంట్లోని ఎన్ క్లోజర్ నుంచి తప్పించుకుని స్వే చ్చగా రోడ్డు మీదకు వచ్చాయి. ఈ లాక్ డౌన్ తో ప్రజలు ఎవరు బయటకు రాకపోవటంతో రోడ్డు మెుత్తం తమదే అన్నట్లుగా భావించి సంతోషంతో వీధులన్ని తిరుగుతున్నాయి. అంతేకాకుండా తిరుగుతూ మేకల గుంపు ఇళ్ల పక్కన ఉండే రకరకాల పూల చెట్లు, గడ్డిని మేయడానికి ప్రయత్నించాయి. ఇంకా కాపరివాడు లేకుండా వెళ్లే ఆ గుంపును గమనించిన ప్రజలు అవన్నీ ఒక మార్గంలో వెళ్లేలా వాటిని అదిలిస్తుండటం వీడియోలో కనిపిస్తుంది.

జాచ్ రోలాండ్స్ అనే ట్విట్టర్ యూజర్ ఇదంతా వీడియో తీసి షేర్ చేశాడు. అంతేకాకుండా ఈ వీడియో చివర్లో ఒక కుక్క కూడా ఈ గుంపుతో కలిసి వీధులన్ని తిరగటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. క్వారంటైన్ సమయంలో ఇది ఒక క్రేజీ విషయం అనే క్యాప్షన్ తో రోలాండ్స్ వీడియోని పంచుకున్నారు. ఇప్పటివరకు ఈ వీడియోకి దాదాపు 7 లక్షల మంది వీక్షించారు. 18 వేలకు పైగా లైకులు వచ్చాయి. 4,800 కు పైగా రీట్వీట్ చేశారు.