రికార్డుల ఖైదీ : జైలుశిక్ష అనుభవిస్తూ..31 డిగ్రీలు పూర్తి చేసి..గవర్నమెంట్ ఉద్యోగం

  • Published By: nagamani ,Published On : November 9, 2020 / 03:38 PM IST
రికార్డుల ఖైదీ : జైలుశిక్ష అనుభవిస్తూ..31 డిగ్రీలు పూర్తి చేసి..గవర్నమెంట్ ఉద్యోగం

Updated On : November 9, 2020 / 4:12 PM IST

Gujarat Prisoner Degree Records : జైలుశిక్ష పడిన ఖైదీలు ఏంచేస్తారు? శిక్షాకాలం ఎప్పుడు పూర్తి అవుతుందాని ఎదురుచూస్తుంటారు. జైలులో ఉన్నన్ని రోజులు అధికారులు ఖైదీలకు ఏదోక పనినేర్పిస్తుంటారు. అలా నేర్చుకున్న పనివారు విడుదల అయ్యాక పనికొస్తుందనే ఉద్ధేశ్యంతో. కానీ ఓ ఖైదీ మాత్రం తన జైలు జీవితంలో 8 సంవత్సరాల సమయంలో డిగ్రీలు మీద డిగ్రీలు సంపాదించాడు. ఒకటీ రెండూ కాదు ఏకంగా 31 డిగ్రీలు సాధించాడు.అంతేకాదు ఏకంగా గవర్నమెంట్ ఉద్యోగం కూడా సంపాదించాడు.



ఉద్యోగం వచ్చాక కూడా తన చదువుని కొనసాగించి మరో డిగ్రీ సాధించి మొత్తం 32 డిగ్రీల పట్టభద్రుడయ్యాడు. ఆ డిగ్రీల ఖైదీ పేరు ‘‘భానూభాయీ పటేల్’’. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన భానూభాయీ పటేల్ డిగ్రీల మీద డిగ్రీలు పూర్తి చేస్తూ..ఆల్ మోస్ట్ అన్ని రికార్డులు సాధించేశాడు. భానూభాయీ తన పేరును లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆప్ రికార్డ్స్, యూనిక్ వరల్డ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, యూనివర్శల్ రికార్డ్ ఫోరం, వరల్డ్ రికార్డ్ ఇండియాలలో నమోదుచేసుకున్నాడు.
https://10tv.in/brazilian-prisoners-lucifer-kills-48-inmates-during-his-25-years-behind-bars/



వివరాల్లోకి వెళితే..భానూభాయీ పటేల్ భావ్ నగర్‌లోని మహువాకు చెందిన వ్యక్తి. అహ్మదాబాద్‌లోని బీజే మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసిన అనంతరం 1992లో భానూభాయీ అమెరికా వెళ్లారు. అక్కడ అతని స్నేహితుడు స్టూడెంట్ వీసాతో ఉద్యోగం చేస్తూ, తన జీతాన్ని భానూభాయీ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో భానూభాయీపై ఫారిన్ ఎక్స్ఛేంజ్ రెగ్యులేషన్ యాక్ట్(ఫెరా)చట్టం ఉల్లంఘన కింద 10 ఏళ్ల జైలుశిక్ష విధించారు. అనంతరం అహ్మదాబాద్ జైలుకు తరలించారు.




ఈ శిక్ష విధించే సమయానికి భానూభాయీకి 50 ఏళ్లు. జైలు నుంచి విడుదలయ్యాక భానూభాయ్ కు అంబేద్కర్ యూనివర్శిటీ నుంచి జాబ్ ఆఫర్ వచ్చింది. నిజానికి జైలుకు వెళ్లిన వారికి ప్రభుత్వ ఉద్యోగం రాదు. కానీ భానూభాయి డిగ్రీలు చూసి, యూవర్శిటీలో ఉద్యోగం ఇచ్చారు. అది చదువు పట్ల అతను కనబరిచి శ్రద్ధను నిదర్శనం.అలా.. ఉద్యోగంలో చేరాక కూడా భానూభాయీ తన చదువు మానలేదు. డిగ్రీలు సాధించటం మానలేదు. తన డిగ్రీల ఆకాంక్షను..దాహాన్ని కొనసాగించాడు. ఉద్యోగం వచ్చాక ఐదేళ్లకాలంలో మరో 23 డిగ్రీలు పూర్తి చేశాడు.




అలా భానూభాయీ సాధించిన మొత్తంగా 54 డిగ్రీలు చేశాడు. అలాగే గుజరాతీ, హిందీ, ఆంగ్ల భాషల్లో మూడు పుస్తకాలు కూడా రాశాడు డిగ్రీల ఖైదీ భాబూభాయి. మరి ఇన్ని ఘనతలు సాధించిన డిగ్రీల ఖైదీ భానూభాయీకి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆప్ రికార్డ్స్, యూనిక్ వరల్డ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, యూనివర్శల్ రికార్డ్ ఫోరం, వరల్డ్ రికార్డ్ ఇండియాలలో భానూభాయి పేరు నమోదైంది.