Covid 19 Outbreak
COVID-19 Outbreak: ఇప్పుడిప్పుడే మళ్ళీ ప్రజలు సాధారణ జీవనానికి అలవాటు పడుతున్నారు. మహమ్మారి భయాన్ని వీడి.. ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఒకవైపు మరో వేవ్ వస్తుందనే టెన్షన్ కొంత ఉన్న క్రమంలో కోవిడ్ పుట్టినిల్లైన చైనాలో తాజాగా కొత్త కరోనా వేరియంట్‌కి సంబంధించిన కేసులు అనుహ్యంగా పెరగడం మళ్ళీ ప్రపంచ దేశాలను టెన్షన్ పడేలా చేస్తుంది. ఈ మధ్య కాలం వరకు అదుపులోనే ఉన్న చైనాలో కరోనా ఇప్పుడు ఒక్కసారిగా మళ్ళీ విజృంభిస్తుంది.
Covid-19 In India : భారత్ లో 24 గంటల్లో 1938 కోవిడ్ కేసులు..67 మంది మృతి
ప్రస్తుతం చైనాల కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ వైరస్ విజృంభణ చూస్తే ఇప్పడప్పుడే అదుపులోకి వచ్చే పరిస్థితి ఏ మాత్రం కనబడటం లేదు. చివరికి రోజువారీ కోవిడ్ కేసులు మంగళవారం రికార్డు స్థాయిలో 4,477కి పెరగడంతో షాంఘై నగరం తూర్పు భాగంలో నివసించే ప్రజలకు లాక్‌డౌన్ పరిమితులను విధించింది చైనా ప్రభుత్వం.
China Shenzhen Lock Down : చైనాలో మళ్లీ కరోనా విజృంభణ.. లాక్‌డౌన్‌లోకి మరో నగరం!
ఒకరకంగా చెప్పాలంటే షాంఘై నగరం సగభాగం వరకు ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉండడంతో అధికారులు అక్కడ ప్రజలకు తీవ్ర షరతులు విధించారు. కేవలం కరోనా పరీక్షకు మాత్రమే ఇంటి నుండి బయటకి రావాలని కఠిన లాక్ డౌన్ నిబంధనలు విధించారు. పుడోంగ్ జిల్లాలో కూడా వైరస్ వ్యాప్తి అధికంగా ఉండడంతో అధికారులు ఆంక్షలు విధించారు. సామాన్య ప్రజలెవరూ బహిరంగ ప్రదేశాలలో కూడా తిరగకూడదని కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో పలు ప్రాంతాలలో ప్రజలు ఇళ్లకే పరిమితమవగా.. చైనాలో పరిస్థితిలపై ప్రపంచ దేశాలలో ఆందోళన నెలకొంది.