Covid-19 In India : భారత్ లో 24 గంటల్లో 1938 కోవిడ్ కేసులు..67 మంది మృతి

భారత్ లో 24 గంటల్లో 1938 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి..67 మంది మృతి చెందారు.

Covid-19 In India : భారత్ లో 24 గంటల్లో 1938 కోవిడ్ కేసులు..67 మంది మృతి

India Govt Reports 1938 Fresh Corona Cases

India Covid-19 UP date  : భారత్ లో కోవిడ్ గణనీయంగా తగ్గుముఖం పట్టింది.అయినా కొత్తగా కేసులు నమోదు అవుతునే ఉన్నాయి. దీంట్లో భాగంగా భారతదేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 1,938 కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 6.6 లక్షల మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 1,938 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే 2,531 మంది కరోనా నుంచి కోలుకోగా… 67 మంది మృతి చెందారు.

ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 0.29 శాతంగా ఉంది. దేశంలో ప్రస్తుతం 22,427 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 4,24,75,588 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 182 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ వేయగా… నిన్న ఒక్కరోజే 31.8 లక్షల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ప్రస్తుతం 12 ఏళ్లు పైబడిన వారికి కూడా వ్యాక్సిన్ వేస్తున్న సంగతి తెలిసిందే. వీరికి రెండు డోసులు పూర్తి అయిన తరువాత బూస్టర్ డోసు కూడా వేయనున్నారు.

కాగా..ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు తగ్గుతున్నా కోవిడ్ నిబందనలు మాత్రం తప్పనిసరిగా కొనసాగించాలని లేదంటే మరోసారి మహమ్మారి విజృంభిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కోవిడ్ వైరస్ ఇంకా స్ట్రాంగ్ గానే ఉందని..దాన్ని నియంత్రించాలంటే నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అని సూచించింది.