China Shenzhen Lock Down : చైనాలో మళ్లీ కరోనా విజృంభణ.. లాక్‌డౌన్‌లోకి మరో నగరం!

China Shenzhen : చైనాలోని వుహాన్ సిటీలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. ప్రపంచమంతా కరోనా కేసులు తగ్గిన నేపథ్యంలో మళ్లీ చైనాలో కరోనా కొత్త వేరియంట్ విజృంభించడం ఆందోళన రేకిత్తిస్తోంది.

China Shenzhen Lock Down : చైనాలో మళ్లీ కరోనా విజృంభణ.. లాక్‌డౌన్‌లోకి మరో నగరం!

China Shenzhen Shenzhen Shut Down As China On Brink Of Biggest Covid 19 Crisis Since Wuhan (2)

China Shenzhen Lock Down: ఒకప్పటి కరోనా పుట్టినిల్లు అయిన చైనాలోని వుహాన్ సిటీలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. ప్రపంచమంతా కరోనా కేసులు తగ్గిన నేపథ్యంలో మళ్లీ చైనాలో కరోనా కొత్త వేరియంట్ ఒకటి విజృంభించడం ఆందోళన రేకిత్తిస్తోంది. కొత్త కరోనా కేసులను పూర్తి నిర్మూలించేందుకు చైనా చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టినట్టు కనిపిస్తున్నాయి. చైనాలోని హైటెక్ సిటీ ఆఫ్ షెన్‌జెన్ (Shenzhen) మరో నగరం లాక్‌డౌన్‌లోకి వెళ్లనుంది. ఈ హైటెక్ సిటీ 17 మిలియన్లకు పైగా జనాభాను కలిగి ఉంది. గత రెండేళ్లలో ఎన్నడూ లేని విధంగా కరోనావైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు చైనా ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నగరంలో అన్ని బస్సులు మెట్రో సేవలు నిలిచిపోయాయి. కరోనా వ్యాప్తి కారణంగా అన్ని కమ్యూనిటీలు, గ్రామాలు కూడా మూతపడనున్నాయి. షెన్‌జెన్ సిటీ ఫిబ్రవరి చివరి నుంచి ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతోంది.

వచ్చే వారం నగరవ్యాప్తంగా మూడు రౌండ్ల కోవిడ్-19 పరీక్షలను చైనా అధికారులు నిర్వహించనున్నారు. నగరవాసులు ఎవరూ ఇంటి నుంచి బయటకు రావొద్దని, అందరూ ఇంట్లో నుంచే పనిచేయాలని నిత్యావసర వస్తువుల కోసం మాత్రమే బయటకు రావాలని నగర అధికారులు కోరారు. వరుసగా రెండు రోజులుగా నగరంలో 1,000 కొత్త కేసులు నమోదవుతున్నాయి. చైనాలో కొత్త కేసులు 3,100 కంటే ఎక్కువగా ఉన్నాయని జాతీయ ఆరోగ్య కమిషన్ ఆదివారం నివేదించింది. ఈ కరోనా కొత్త కేసులు ఈ స్థాయిలోనమోదు కావడం.. రెండేళ్లలో ఇదే అత్యధికమని అధికారులు అంచనా వేస్తున్నారు.

నివేదిక ప్రకారం.. షెన్‌జెన్ సిటీ నుంచి బయటికి వెళ్లే ప్రయాణికులందరూ తప్పనిసరిగా నెగిటివ్ న్యూక్లియిక్ యాసిడ్ టెస్టు ఫలితాన్ని సమర్పించాల్సి ఉంటుంది. చైనాలో వుహాన్ సిటీ తర్వాత అత్యధికంగా షెన్‌జెన్‌ నగరంలోనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. 2019 డిసెంబర్‌లో వుహాన్‌లో మొట్టమొదటగా కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు కరోనా వ్యాప్తి చెందింది. ఇప్పటివరకు కరోనా బారినపడి 6 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయారు.

China Shenzhen Shenzhen Shut Down As China On Brink Of Biggest Covid 19 Crisis Since Wuhan

China Shenzhen Shenzhen Shut Down As China On Brink Of Biggest Covid 19 Crisis Since Wuhan

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్న క్రమంలో ఇప్పుడు చైనాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. డ్రాగన్ దేశంలో కేవలం ఒక షెన్‌జెన్ నగరం మాత్రమే కాదు.. బీజింగ్, షాంఘైతో సహా అనేక ఇతర నగరాల్లోనూ కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. చైనా జీరో కరోనా కేసులకు తీసుకొచ్చే విధానాన్ని అమలు చేస్తోంది. అందులో భాగంగా గత కొన్ని వారాల్లో చైనాలోని 16 ప్రావిన్సులు, 4 పెద్ద నగరాలు, బీజింగ్, టియాంజిన్, షాంఘై, చాంగ్‌కింగ్ ప్రాంతాల్లో కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త కరోనా కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్ వేరియంట్ కారణమని స్థానిక ఆరోగ్య అధికారులు పేర్కొన్నారు.

ఈ కరోనా వేరియంట్ సోకిన బాధితుల్లో కరోనా వైరస్ కన్నా తక్కువ తీవ్రమైన లక్షణాలను ఉంటున్నాయని నివేదిక తెలిపింది. కరోనా బాధితులను గుర్తించేందుకు వీలుగా నగరవ్యాప్తంగా కరోనా టెస్టు కోసం చైనా యాంటిజెన్ ఆప్షన్ తీసుకొచ్చింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నగరవవాసులు ఎవరూ కూడా సిటీని వదిలి వెళ్లొద్దని షాంఘై అధికారులు ప్రజలను కోరారు. నగరాన్ని వదిలివెళ్లేవారు తప్పనిసరిగా 48 గంటల ముందు తీసుకున్న న్యూక్లియిక్ యాసిడ్ టెస్టు రిపోర్టు కలిగి ఉండాలని అధికారులు సూచించారు. చైనాలోని హాంకాంగ్‌లో కరోనా పరిస్థితి మరింత దిగజారుతూనే ఉంది. 27,647 కొత్త కేసులు నమోదు కాగా.. 87 కరోనా మరణాలు నమోదయ్యాయి.

Read Also : China New Virus : చైనాలో మరో కొత్త వైరస్ కలకలం.. చైనీయుల్లో భయాందోళన