Hamas New Submarine Drone : హమాస్ అమ్ముల పొదిలో కొత్త సబ్ మెరైన్ డ్రోన్ ఆయుధం ‘టార్పెడో’

హమాస్ అమ్ముల పొదిలో కొత్త సబ్ మెరైన్ డ్రోన్ ఆయుధం టార్పెడో ఉంది. ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య గాజాలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో హమాస్ తన అల్-అసెఫ్ గైడెడ్ ‘టార్పెడో’ వీడియోను మంగళవారం విడుదల చేసింది....

Hamas New Submarine Drone : హమాస్ అమ్ముల పొదిలో కొత్త సబ్ మెరైన్ డ్రోన్ ఆయుధం ‘టార్పెడో’

Submarine Drone Weapon

Updated On : November 2, 2023 / 10:15 AM IST

Hamas New Submarine Drone : హమాస్ అమ్ముల పొదిలో కొత్త సబ్ మెరైన్ డ్రోన్ ఆయుధం టార్పెడో ఉంది. ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య గాజాలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో హమాస్ తన అల్-అసెఫ్ గైడెడ్ ‘టార్పెడో’ వీడియోను మంగళవారం విడుదల చేసింది. ఈ కొత్త సబ్‌మెరైన్ డ్రోన్ వెపన్ ను ఇజ్రాయెల్ యుద్ధంలో ఉపయోగిస్తామని హమాస్ పేర్కొంది. నీటి అడుగున ఉండే ఈ డ్రోన్లు శత్రు వాహనాలపై దాడులు చేయనున్నాయి.

Also Read : ED raids : సీఎం విచారణకు ముందు మరో ఢిల్లీ మంత్రి ఇంటిపై ఈడీ దాడులు

ఈ డ్రోన్లను ఇజ్రాయెల్ లక్ష్యాలను తిప్పికొడతాయని హమాస్ తెలిపింది. టార్పెడో మెటల్ కవచంతో కంప్రెస్డ్ గ్యాస్ సిలిండరును పోలీ ఉంటుంది. అల్-కస్సామ్ బ్రిగేడ్స్‌కు చెందిన నలుగురు హమాస్ డైవర్లు ఈ కొత్త ఆయుధాన్ని నీటిలోకి తీసుకువెళ్లారు. ఈ ఆయుధాన్ని 2023 అక్టోబర్ 7వతేదీన గాజా నుంచి ఇజ్రాయెల్‌పై హమాస్ నేతృత్వంలోని దాడి సమయంలో ఉపయోగించారు.

Also Read : CM Arvind Kejriwal : సీఎం కేజ్రీవాల్‌ను విచారించనున్న ఈడీ…ఢిల్లీలో హైఅలర్ట్

హమాస్ ఇదే ఆయుధంతో ఇజ్రాయెల్ నౌకాదళ ఆస్తులపై దాడి చేయడానికి ప్రయత్నించిందని వెల్లడైంది. టార్పెడోలు నీటి అడుగున డ్రోన్‌ల లక్షణాలను మిళితం చేసే ఇలాంటి ఆయుధాలను ఇరాన్, ఉత్తర కొరియా దేశాలు నిర్మించాయి. కాగా అమెరికా అధికారులను హత్య చేసేందుకు ఇరాన్ పన్నాగం పన్నుతుందని ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే ఆరోపించారు.

Also Read : Pakistan : పాకిస్థాన్‌లో ఎదురుకాల్పులు…ఆరుగురు ఉగ్రవాదులు హతం

సెనేట్ విచారణ సందర్భంగా తీవ్రవాద ముప్పు పెరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఇరాన్ మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తుందని అమెరికా పదేపదే ఆరోపించింది.