Michael Jackson: పాప్ సింగర్ మైకేల్ జాక్సన్, ప్రిన్సెస్ డయానా, పాల్ వాకర్, అమీ వైన్‌హౌజ్ లాంటి ప్రముఖులు మరణించి చాలా సంవత్సరాలు అవుతోంది. వీళ్లలో చాలా మంది యంగ్ ఏజ్, మిడిల్ ఏజ్‌లో ప్రాణాలు కోల్పోయిన వాళ్లే.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు వీళ్లింకా బతికే ఉంటే బాగుండేది అనుకుంటూ ఉంటారు. ఒకవేళ ఈ సెలబ్రిటీలు బతికే ఉంటే ఇప్పుడు ఎలా ఉండేవారో అనే ఆలోచన ఎప్పుడన్నా, ఎవరికైనా వచ్చిందా? ఎవరి సంగతో తెలీదు కానీ.. టర్కీకి చెందిన ఒక ఆర్టిస్ట్‌కు వచ్చింది. ఆ ఆర్టిస్ట్ పేరు.. ఆల్పర్ యెసిల్టాస్. అతడు ప్రముఖ సెలబ్రిటీలు బతికే ఉంటే బహుశా ఇప్పుడు ఎలా ఉండేవారో ఊహిస్తూ కొన్ని ఇమేజెస్ క్రియేట్ చేశాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాడి వీటిని సృష్టించాడు. మైకేల్ జాక్సన్, ప్రిన్సెస్ డయానా, పాల్ వాకర్, హీత్ లెడ్జర్, జాన్ లెన్నన్ వంటి ప్రముఖుల చిత్రాల్ని అతడు క్రియేట్ చేసి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు.
Himachal Pradesh: లోయలో పడ్డ టెంపో ట్రావెలర్.. ఏడుగురు మృతి.. పది మందికి గాయాలు
నిజంగానే వాళ్లు బతికే ఉంటే ఎలా ఉండేవారో తెలీదు. కానీ, ఇప్పుడీ చిత్రాల్ని చూసిన వారి అభిమానులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాలకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. కావాలంటే మీరూ వాటిని చూడండి.