Rajasthan Congress: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు.. రాజస్థాన్ కాంగ్రెస్‌లో కలకలం.. అశోక్ గెహ్లాట్ వర్గ ఎమ్మెల్యేల రాజీనామా

కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్ష ఎన్నిక ఆ పార్టీలో చిచ్చు పెడుతోంది. రాజస్థాన్ కాంగ్రెస్‌లో కలవరం సృష్టిస్తోంది. సీఎం అశోక్ గెహ్లాట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. సచిన్ పైలట్‌ను సీఎం కాకుండా అడ్డుకుంటున్నారు.

Rajasthan Congress: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు.. రాజస్థాన్ కాంగ్రెస్‌లో కలకలం.. అశోక్ గెహ్లాట్ వర్గ ఎమ్మెల్యేల రాజీనామా

Rajasthan Congress: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు ఆ పార్టీలో చిచ్చురేపుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో ఉన్న గ్రూపు తగాదాల్ని బయటపెడుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీలో రాజకీయం ముదురుతోంది. సీఎంగా ఉన్న అశోక్ గెహ్లాట్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న నేపథ్యంలో ఆయన సీఎంగా రాజీనామా చేసే అవకాశాలున్నాయి.

Indrakeeladri: నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులు.. పది రోజులు పది అవతారాల్లో అమ్మవారి దర్శనం

అయితే, అశోక్ గెహ్లాట్ తర్వాత సీఎంగా ఎవరిని నియమిస్తారు అనే అంశంపై కాంగ్రెస్ పార్టీలో బేధాభిప్రాయాలున్నాయి. సచిన్ పైలట్‌ను సీఎం చేస్తారనే సమాచారం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోని మెజార్టీ ఎమ్మెల్యేలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అశోక్ గెహ్లాట్ వర్గానికి చెందిన దాదాపు 90 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ సీపీ జోషికి రాజీనామా సమర్పించారు. సచిన్ పైలట్‌ను సీఎంగా నియమించకూడదని, అశోక్ గెహ్లాట్ వర్గంలోంచి ఒకరిని సీఎంగా నియమించాలని వారు కాంగ్రెస్ హై కమాండ్‌ను డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఆదివారం సీఎం అశోక్ గెహ్లాట్, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జి మల్లికార్జున ఖర్గే, అజయ్ మాకెన్ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అశోక్ వర్గం ఎమ్మెల్యేలే రాలేదు. దీంతో సమావేశం నిలిచిపోయింది.

Bangladesh: బంగ్లాదేశ్‌లో పడవ మునిగి 24 మంది మృతి.. పలువురు గల్లంతు.. మృతులంతా హిందువులే

మరోవైపు ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసి రాజీనామ సమర్పించారు. సోమవారం తిరుగుబాటు ఎమ్మెల్యేలతో సమావేశం కావాలని మల్లికార్జున ఖర్గే భావిస్తున్నారు. ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా తనతో మాట్లాడాలని కోరారు. దీనికి ఎంతమంది హాజరవుతారో స్పష్టత లేదు. మరోవైపు కాగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవి ఎన్నిక పూర్తైన తర్వాతే రాజస్థాన్ సీఎం విషయంలో నిర్ణయం తీసుకోవాలని పలువురు ఎమ్మెల్యేలు సూచిస్తున్నారు. ఇక ఈ అంశంపై అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల రాజీనామా విషయంలో తానేమీ చేయలేనని ఆయన అన్నారు. 200 అసెంబ్లీ సీట్లున్న రాజస్థాన్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 108 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 90 మంది అశోక్ గెహ్లాట్‌కు మద్దతిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేల రాజీనామా వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.