Hezbollah Tunnel : శ్మశాన వాటిక కింద హెజ్బొల్లా భారీ టన్నెల్.. లోపల ఏమున్నాయంటే.. వీడియో వైరల్

లెబనాన్ లో హెజ్బొల్లా వాడే పలు టెన్నెళ్లను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇప్పటికే కనుగొని బయటపెట్టింది. తాజాగా లెబనాన్ లోని శ్మశాన వాటిక కింద ఉన్న హెజ్బొల్లా గ్రూపుకు సంబంధించిన

Hezbollah Tunnel : శ్మశాన వాటిక కింద హెజ్బొల్లా భారీ టన్నెల్.. లోపల ఏమున్నాయంటే.. వీడియో వైరల్

Hezbollah Tunnel

Updated On : November 11, 2024 / 9:46 AM IST

Hezbollah Tunnel Video Viral : లెబనాన్ లో హెజ్బొల్లా వాడే పలు టెన్నెళ్లను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇప్పటికే కనుగొని బయటపెట్టింది. తాజాగా లెబనాన్ లోని శ్మశాన వాటిక కింద ఉన్న హెజ్బొల్లా గ్రూపుకు సంబంధించిన మరో భారీ టన్నెల్ ను ఇజ్రాయెల్ సైన్యం గుర్తించింది. ఇందుకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ఈ టెన్నెల్లో భారీగా తుపాకులు, మందుగుండు సామాగ్రి, గ్రెనేడ్ లాంచర్లు, క్షిపణులు, ఇతర మిలిటరీ -గ్రేడ్ పరికరాలతోసహా ఆయుధాల నిల్వలు ఉన్నాయి.

Also Read: Benjamin Netanyahu : హిజ్బుల్లాపై పేజర్‌ దాడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చా.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ విధంగా పేర్కొంది. ‘మా సైనికులు హెజ్బొల్లాకు చెందిన అనేక భూగర్భ సొరంగాలను కూల్చివేశారు. ఇందులో వ్యూహాత్మకంగా వారు శ్మశాన వాటిక కింద నిర్మించిన సొరంగం కూడా ఉంది. కిలో మీటరు మేర ఉన్న ఈ సొరంగంలో కమాండ్, కంట్రోల్ రూమ్ లు ఉన్నాయి. హెజ్బొల్లాకు మానవ జీవితం అంటే లెక్కలేదు. చనిపోయినా, బతికినా పట్టించుకోదు’ అంటూ ఐడీఎఫ్ వీడియోను పోస్టు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌ హత్యకు ఇరాన్ కుట్ర చేసిందా..? ఇరాన్ విదేశాంగ మంత్రి ఏమన్నారంటే

ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) ఇటు గాజాపై, అటు లెబనాన్ పై భీకర దాడులతో విరుచుకుపడుతోంది. ఆదివారం లెబనాన్ లో ఇజ్రాయెల్ వైమానిక దాడుల ఫలితంగా 23 మంది మరణించారని లెబనాన్ అధికారులు తెలిపారు. ఇందులో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. మరోవైపు.. సెప్టెంబర్ 23న లెబనాన్ లోని హిజ్బొల్లాతో యుద్ధం చెలరేగినప్పటి నుంచి ఇజ్రాయెల్ సిరియాపై దాడులను పెంచుతోంది. సిరియా రాజధానికి దక్షిణంగా ఉన్న సయ్యిదా జైనాబ్ ప్రాంతంలోని ఓ అపార్ట్ మెంట్ పై ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసింది. ఇందులో లెబనీస్ కుటుంబాలు, హెజ్బొల్లా సభ్యులు నివసిస్తున్నారు. తాజాగా ఇజ్రాయెల్ సైన్యం దాడితో 14 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.