Hindi in UNESCO : యునెస్కో వెబ్‌సైట్‌లో హిందీ భాష

జనవరి 10 ప్రపంచ హిందీ దినోత్సవం సందర్భంగా యునెస్కో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వారసత్వం కేంద్రం వెబ్‌సైట్‌లో.. భారత్‌కు చెందిన వారసత్వ కట్టడాల వివరాలు హిందీలో రానున్నాయి.

Hindi in UNESCO : యునెస్కో వెబ్‌సైట్‌లో హిందీ భాష

Hindi Language On Unesco Website

Updated On : January 12, 2022 / 12:03 PM IST

Hindi in UNESCO website : జనవరి 10. ప్రపంచ హిందీ దినోత్సవం. ఈ సందర్భంగా యునెస్కో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వారసత్వం కేంద్రం(వరల్డ్‌ హెరిటేజ్‌ సెంటర్‌) వెబ్‌సైట్‌లో.. భారత్‌కు చెందిన వారసత్వ కట్టడాల వివరాలను హిందీలోనూ అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది. పారిస్ లోని యునెస్కో భారత శాశ్వత ప్రతినిధి విశాల్‌ వీ శర్మకి ఈ విషయాన్ని వెల్లడించారు. యునెస్కో తీసుకున్న ఈ నిర్ణయంపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

Read more : Ramappa Temple : రామప్ప దేవాలయానికి ప్రపంచ గుర్తింపు

యునెస్కో తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రాత్మకమైనది. ఈ నిర్ణయం హిందీ భాషకు ప్రపంచ గుర్తింపు రావటానికి ఉపయోగపడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.కాగా..జనవరి 10న ప్రపంచ హిందీ దినోత్సవాన్ని యునెస్కోలో వర్చువల్‌గా నిర్వహించారు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో హిందీ భాష గురించి కీలక అంశాలు..హిందీ ప్రాముఖ్యతను విశాల్‌ వీ శర్మ వివరించారు. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి హాజరై ప్రసంగించారు. హిందీ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.

Read more : Ramappa Temple : రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు కోసం..కేంద్రానికి తెలంగాణ మంత్రుల వినతి

ఐక్యరాజ్యసమితికి చెందిన ఒక ప్రధానమైన సంస్థ యునెస్కో. ఇది ఒక ప్రత్యేక సంస్థ కూడా. యునెస్కోని 1945 లో స్థాపించారు. తన క్రియాశీల కార్యక్రమాలలో శాంతి, రక్షణలకు తన తోడ్పాటుని అందిస్తుంది. అంతర్జాతీయ సహకారంతో విద్య, విజ్ఞానం, సాంస్కృతిక పరిరక్షణ కొరకు పాటు పడుతుంది. ఇది నానాజాతి సమితి యొక్క వారసత్వం కూడా. యునెస్కోలో 193 సభ్యులు, 6 అసోసియేట్ సభ్యులున్నారు. యునెస్కో ప్రధాన కేంద్రం పారిస్, ఫ్రాన్సులో ఉంది. యునెస్కో 170 భాషలు అందుబాటులో ఉన్నాయి.