Mummy CT Scan : ఈజిప్ట్ మమ్మీలకు సిటీ స్కాన్..! ఎందుకో తెలుసా?

పురాతన ఈజిప్ట్ మమ్మీలకు సిటీ స్కాన్ తీస్తున్నారు. ఎందుకో తెలుసా? ఒక పరిశోధన ప్రాజెక్టులో భాగంగా ఈజిప్ట్ మమ్మీల వెనుక ఉన్న రహాస్యాలను బయటపెట్టనున్నారు. ఆధునిక వైద్య టెక్నాలజీ కలిగిన ఇటాలీ ఆస్పత్రిలో ఈజిప్ట్ మమ్మీలకు సిటీ స్కానింగ్‌ చేయిస్తున్నారు.

Egyptian Mummy CT Scan : పురాతన ఈజిప్ట్ మమ్మీలకు సిటీ స్కాన్ తీస్తున్నారు. ఎందుకో తెలుసా? ఒక పరిశోధన ప్రాజెక్టులో భాగంగా ఈజిప్ట్ మమ్మీల వెనుక ఉన్న రహాస్యాలను బయటపెట్టనున్నారు. ఆధునిక వైద్య టెక్నాలజీ కలిగిన ఇటాలీ ఆస్పత్రిలో ఈజిప్ట్ మమ్మీలకు సిటీ స్కానింగ్‌ చేయిస్తున్నారు. పురాతన ఈజిప్టు పూజారి (Ankhekhonsu) మమ్మీని బెర్గామో సివిక్ ఆర్కియాలజికల్ మ్యూజియం నుంచి మిలన్ పోలిక్లినికో ఆస్పత్రికి నిపుణులు తరలించారు.

అతని జీవితం, దాదాపు 3,000 ఏళ్ల క్రితం ఖననం చేసిన ఆచారాలకు సంబంధించి రహస్యాలను వెలుగులోకి తీసుకుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మమ్మీలు ఆచరణాత్మకంగా బయోలాజికల్ మ్యూజియం, టైమ్ క్యాప్సూల్ లాంటివి అని మమ్మీ ప్రాజెక్ట్ రీసెర్చ్ డైరెక్టర్ సబీనా మాల్గోరా అన్నారు. మమ్మీ పేరుపై సమాచారం క్రీస్తుపూర్వం 900, 800 మధ్య నాటి సార్కోఫాగస్ నుంచి వచ్చిందన్నారు. అలాగే మమ్మీలపై చెక్కిన అక్షరాల్లో అఖేఖోన్సు అని ఐదుసార్లు రాసి ఉంది..

అంటే ‘ఖోన్సు దేవుడు సజీవంగా ఉన్నాడు’ అని అర్ధంగా చెబుతారు. పరిశోధకులు ఈజిప్టు పూజారి జీవితం, అతడి మరణాన్ని గురించి పరిశోధించనున్నారు. అతడి శరీరాన్ని మమ్మీ చేయడానికి ఏ రకమైన ఉత్పత్తులను ఉపయోగించారో తెలుసుకోనున్నారు. ఆధునిక వైద్య పరిశోధనల్లో పురాతన వ్యాధులు, గాయాలను అధ్యయనం చేస్తుంటారు.

గతంలోని క్యాన్సర్ లేదా ఆర్టిరియోస్క్లెరోసిస్ గురించి కూడా మమ్మీల ద్వారా అధ్యయనం చేయవచ్చునని అంటున్నారు. ఆధునిక పరిశోధనలకు ఇది చాలా ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు. మమ్మీలను సిటీ స్కానింగ్ ద్వారా పరీక్షించి వాటి రహాస్యాలను బయటపెట్టే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు