Houston post office dhaliwal : హ్యూస్టన్ పోస్టాఫీస్‌కు భారతీయుడి పేరు..సిక్కు పోలీసుకు అరుదైన గౌరవం

ఇండో-అమెరికన్ సిక్కు పోలీసు అధికారికి నిజమైన నివాళి లభించింది. 2019లో అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో దారుణ హత్యకు గురైన సిక్కు పోలీసు అధికారి సందీప్ సింగ్ ధలివాల్ పేరు పెట్టారు.

Houston’s post office named Sandeep singh dhaliwal : ఇండో-అమెరికన్ సిక్కు పోలీసు అధికారికి నిజమైన నివాళి లభించింది. 2019లో అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డ్యూటీ చేస్తున్న సమయంలో దారుణ హత్యకు గురైన ఇండో-అమెరికన్ సిక్కు పోలీసు అధికారి 42 ఏళ్ల సందీప్ సింగ్ ధలివాల్ పేరును వెస్ట్‌ హ్యూస్టన్‌లోని ఒక పోస్టాఫీస్‌కు పెట్టారు. ఆయన చేసిన సేవలకు నివాళిగా..ఆయన చేసిన సేవలకు గౌవర సూచకంగా థలివాల్ పేరును వెస్ట్‌ హ్యూస్టన్‌లోని ఒక పోస్టాఫీస్‌కు పెట్టారు.

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో సందీప్ సింగ్ ధలివాల్ హారిస్ కౌంటీ డిప్యూటీ షెరీఫ్. ఆయనకు ముగ్గురు పిల్లలు. 2019 సెప్టెంబర్ 27 న ట్రాఫిక్‌ డ్యూటీ చేస్తుండగా..ధలివాల్‌ను గుర్తుతెలియని వ్యక్తి వెనుక నుంచి తుపాకీతో కాల్చి చంపాడు. 2015 లో టెక్సాస్‌లో పనిచేసిన మొదటి సిక్కు పోలీసు అధికారిగా ధలివాల్ పేరొందారు. గడ్డం పెంచుకునేందుకు, తలపాగా ధరించేందుకు అనుమతి పొందిన అమెరికాలో మొదటి సిక్కు పోలీసు అధికారి ధలివాల్ హారిస్ కావాటం విశేషం.

ధలివాల్‌ పేరును వెస్ట్‌ హ్యూస్టన్‌ పోస్టాఫీస్‌కు పెట్టిన విషయాన్ని హారిస్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం (హెచ్‌సీఎస్‌) బుధవారం ట్వీట్టర్ వేదికగా వెల్లడిస్తు..‘డ్యూటీలో ఉండగా ప్రాణాలు కోల్పోయిన సందీప్ సింగ్ ధలివాల్ మా సోదరుడు. ఆయన జ్ఞాపకార్థం వెస్ట్ హారిస్ కౌంటీలోని పోస్టల్ ఆఫీసు పేరు మార్చడం చాలా గొప్ప విషయం. ఇది ఆయనకు గౌరవసూచకం. ఆయనను స్మరించుకునే అవకాశం కల్పించిన హారిస్ కౌంటీ కమీషనర్స్‌ కోర్టుకు, అమెరికా పోస్టల్‌ విభాగం అధికారులకు, సిక్కు జాతికి కృతజ్ఞతలు’ అని బుధవారం (అక్టోబర్ 6,2021) ట్వీట్‌లో రాశారు.

Read more : SkyUp Airlines: ఎయిర్‌లైన్స్‌ మహిళా ఉద్యోగులకు హైహిల్స్‌,స్కర్ట్‌లకు బదులుగా కొత్త యూనిఫాం
“డిప్యూటీ సందీప్ సింగ్ ధాలివాల్ పోస్టాఫీసు” ని అంకితం చేయడానికి హ్యూస్టన్ సిక్కు సంఘం, స్థానిక ఎన్నికైన అధికారులతో పాటు మరికొంతమంది అడిక్స్-హోవెల్ రోడ్‌లో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రతినిధి లిజ్జీ ఫ్లెచర్ మాట్లాడుతు..”డిప్యూటీ ధలివాల్ నిస్వార్థ సేవ అద్భుతమైనది. ఆయనను స్మరించుకోవడంలో నేను పాత్ర పోషించడం గౌరవంగా ఉంది అని తెలిపారు.

ఇతరులకు సేవ చేయటంలో ఎటువంటి భేషజాలు చూపించేవాడు కాదనీ..ఆయన జీవితం ద్వారా సమానత్వం,సమాజానిక సేవ ఎలా చేయాలనే ఎన్నో మంచి విషయాలు నేర్చుకోవాల్సిన అవసరముందన్నారు. ఈ భవనానికి డిప్యూటీ సందీప్ సింగ్ ధలివాల్ పోస్టాఫీసు పేరు మార్చడం చాలా సంతోషంగా ఉందని ఫ్లెచర్ తెలిపారు.

Read more :‘Givenchy’ Suicide Hoodie Necklace: ‘ఉరితాడు’ డ్రెస్..‘చావమంటారా?’అని తిట్టిపోస్తున్న జనాలు..

“ఇది డిప్యూటీ ధలివాల్ సేవ, త్యాగాలకు నిదర్శనమని..మనందరికీ ఇది స్పూర్తిదాయకమని తెలిపారు. నిబద్ధత కలిగిన ప్రజా సేవకుడిని గౌరవించినందుకు కాంగ్రెస్ మహిళ ఫ్లెచర్ మరియు మొత్తం టెక్సాస్ ప్రతినిధి బృందానికి మేము కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరూ తమ పొరుగువారిని ప్రేమించేలా ప్రేరేపించిన నిజమైన హీరో ధలివాల్ అని పలువురు కొనయాడారు.

 

ట్రెండింగ్ వార్తలు