‘Givenchy’ Suicide Hoodie Necklace: ‘ఉరితాడు’ డ్రెస్..‘చావమంటారా?’అని తిట్టిపోస్తున్న జనాలు..
మెడలో ఉరితాడు లాంటి డ్రెస్సులతో మోడల్స్ ర్యాంప్ వాక్ చేశారు. ఆ డ్రెస్ చూసినవారంతా ఆ డ్రెస్ డిజైన్ చేసిన కంపెనీపై విమర్శలు చేస్తున్నారు.

Givenchy Suicide Hoodie Necklace Designer Dress Controversy (1)
Givenchy Suicide Hoodie Necklace Designer Dress : ఫ్యాషన్. ఫ్యాషన్. నేడు ఫ్యాషన్ క్షణానికొకటి మారిపోతోంది. ఫ్యాషన్ డిజైనర్లు పోటీ పడి మరీ కొత్త కొత్త డిజైన్లు చేస్తున్నారు. విభిన్నమైన డిజైన్లతో మోడళ్లు ర్యాంప్ వాక్ లతో ఫ్యాషన్ డ్రెసుల్లో మెరిసిపోతున్నారు. కొన్ని డ్రెస్సుల డిజైన్లు చూస్తే ‘అబ్బా ఎవరు చేసారోగానీ..ఎంత బాగా డిజన్ చేశారు?’అనిపిస్తుంది. మరికొన్ని ఏంటీ డ్రెస్ ఛండాలంగా ఇదికూడా ఓ డిజైనేనా? అనిపిస్తుంది.
Read more : Viral bride : 100 కిలోల లెహంగాతో వధువు..గ్రాండ్ లుక్ తో వైరల్
కానీ ఓ డ్రెస్ మాత్రం ఏకంగా జనాల్ని చంపేసేలా ఉంది. అంటే అది అంత అద్భుతమైన అందంగా ఉందని కాదు. ఆ డ్రెస్ చూస్తే ఠక్కున చావే గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఆ డ్రెస్ కు ఓ ‘ఉరితాడు’ ఉంది మరి. మరి చావు గుర్తుకు రాక ఛస్తుందా? అన్నట్లే ఉంది. దీంతో జనాలు ఏంటీ..‘చావమంటారా?అని తిట్టిపోస్తున్నారు. దీంతో సదరు డ్రెస్సుని డిజైన్ కంపెనీ ‘సారి’ చెప్పింది. మరి ఏంటా కంపెనీ. ఆ డ్రెస్ అందమేమి కాస్త చూపించరా? అని అడుగుతున్నారు కదూ..చూసేయండీ ఆ ‘ఉరి తాడు’ డ్రెస్ ని..ఏంటీ చూశారా? ఉరితాడు బాగా కనిపించింది కదూ..
ఈ డ్రెస్ ను ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ దుస్తుల కంపెనీ ‘గివెంచీ’ డిజైన్ చేసింది. Spring 2022-Ready to Wear collectionలో భాగంగా ఉరితాడును పోలి ఉన్న ఓ నెక్లెస్‌ను డ్రెస్‌కు అమర్చింది. ఆ ఉరితాడు దుస్తులతో మోడల్స్ ర్యాంప్ వాక్ చేయగా.. చూసినోళ్లంతా ‘చావమంటారా?’ అని తిట్టిపోస్తున్నారు. దీంతో గివెంచీ క్రియేటివ్ డైరెక్టర్ మాథ్యూ విలియమ్స్.. ఆ దుస్తుల్ని వెనక్కి తీసుకోవటమేకాకుండా క్షమాణలు చెప్పారు.
కాగా ఇటువంటి డిజైన్ ఇది తొలిసారి కాదు. గతంలో బ్రిటిష్ దుస్తుల కంపెనీ బర్‌బెర్రీ 2019లో ‘నూస్ హూడీ’ని డిజైన్ చేసి పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చింది.నూస్ హుడీ డిజైన్ ను సూసైడ్ హూడీగా ట్రోల్ చేశారు.