Viral bride : 100 కిలోల లెహంగాతో వధువు..గ్రాండ్ లుక్ తో వైరల్

100 కిలోల బరువున్న లెహంగా వేసుకున్న వధువు వైరల్ అయ్యింది. క్వింటాల్ బరువున్న గౌనుతో అందరిని ఆకట్టుకుంది.

Viral bride : 100 కిలోల లెహంగాతో వధువు..గ్రాండ్ లుక్ తో వైరల్

Pakistani Bride Wedding Wears 100 Kg Lehenga (1)

bride Wedding wears 100 kg lehenga : పెళ్లిలో వధువులు ధరించే దస్తులు..ధరించే నగలు..నడిచి వచ్చే నడక..చేసే డ్యాన్స్ అన్నీ ఇటీవల స్పెషల్ గా ఉంటున్నాయి. జీవితంలో ఒకేసారి చేసుకునే పెళ్లి జీవితాంతంగా గుర్తుండిపోయేలా అరేంజ్ చేసుకుంటున్నానే నేటి తరం యువత. ముఖ్యంగా వెడ్డింగ్ డ్రెస్ లు ఎంతగా ఫేమస్ అవుతున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు.స్పెషల్ గా ఉండాలి. గ్రాండ్ గా కనిపించాలి.అందరు తమ డ్రెస్ గురించే చెప్పుకోవాలి.సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాలి. ఇదే కాన్సెప్టు..

అచ్చు అలాగే ఆలోచించింది పాకిస్థాన్ వధువు. ఆమె ధరించిన లెహంగా సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారింది. పెళ్లికొచ్చినవాళ్లంతా ఆమె వెడ్డింగ్ లెహంగా గురించే చెప్పుకున్నారు. ముఖ్యంగా ఆడవాళ్లైతే గుసగుసలే. ఈ లెహంగా ఎంత గ్రాండ్ గా ఉందంటే ఆల్ ఓవర్ వర్క్ తో ఏకంగా 100 కిలోల బరువుతో అందరి కళ్లను జిగేల్ మనిపించింది. ఆ లెహంగా గ్రాండ్ లుక్క్ తో పాటు అంత బరువున్న ఆ లెహంగా ధరించి ఆమె కాస్త అటూ ఇటూ నడవటానికి కాస్త ఇబ్బందనే చెప్పాలి. వెను కనీసం నలుగురు ఐదుగురైనా దాన్ని పట్టుకోవాల్సిందే.

ఇక పెళ్లి కొడుకు డ్రెస్ విషయానికొస్తే అంత భారీ లెహంగాతో పెళ్లికూతురు అందరి కళ్లను ఆకట్టుకుంటే పెళ్లికొడుకు మాత్రం చాలా సింపుల్ గా గోల్డెన్ షేర్వాణి, మెరూన్ త‌ల‌పాగాతో సింపుల్‌గా త‌యార‌య్యాడు. ఇది ఏడాది కింద‌టి వీడియో అయినా తాజాగా సోష‌ల్ మీడియాలో మ‌రోసారి వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఊరుకుంటారా ఏంటీ? ఎవరికి తోచినట్లు వాళ్లు కామెంట్ చేస్తున్నారు.ఆమె లెహంగాను ధ‌రించిందా లేక లెహంగానే ఆమెను ధ‌రించిందా? అని కొందరంటే..కాదు కాదు పెళ్లికి వచ్చిన గెస్ట్ లకు రెడ్‌కార్పెట్ స్వాగ‌తం ప‌లక‌డానికి బ‌దులు రెడ్ లెహంగా వెల్‌కం ఇచ్చుంటుంది అంటూ ఇలా కామెంట్స్ చేస్తున్నారు.