SkyUp Airlines: ఎయిర్‌లైన్స్‌ మహిళా ఉద్యోగులకు హైహిల్స్‌,స్కర్ట్‌లకు బదులుగా కొత్త యూనిఫాం

తమ ఎయిర్ లెన్స్ లో మహిళా ఉద్యోగులు ఇకనుంచి హైహీల్స్, స్కర్టులు వేసుకోనవసరం లేదని. వారికి కొత్త యూనిఫాంను ప్రవేశపెడుతున్నామని స్కైఅప్ సంస్థ ప్రకటించింది.

SkyUp Airlines: ఎయిర్‌లైన్స్‌ మహిళా ఉద్యోగులకు హైహిల్స్‌,స్కర్ట్‌లకు బదులుగా కొత్త యూనిఫాం

Skyup Airlines  swapping High Heels, Pencil Skirts

SkyUp Airlines  Swapping High Heels, Pencil Skirts  : విమానాల్లో ఎయిర్ హోస్టెస్ లు  మొహం మీద చెదరని చిరునవ్వులతో ప్రయాణీకులకు ఏ సమయంలో ఏది కావాలో అని నిత్యం కనిపెట్టుకుని ఉంటారు. వీరి డ్రెస్ కోడ్ విషయంలో చాలా పర్ ఫెక్ట్ గా ఉంటారు. ఫిష్ కట్ స్కర్టులు, హైహీల్స్ వీరి డ్రెస్ కోడ్ లో తప్పనిసరి. కానీ ఇకనుంచి వీటికి స్వస్తి పలుకుతున్నారు. ఎందుకంటే వారి సౌకర్యం కోసం..వారి ఆరోగ్యం కోసం డ్రెస్ కోడ్ ను మార్చింది స్కైఅప్‌ అనే ఎయిర్ లెన్స్ సంస్థ. మహిళా ఉద్యోగులకు సౌకర్యవంతమైన యూనిఫాంని తీసుకోస్తున్నామని తెలిపింది ఉక్రెయిన్‌ ప్రముఖ విమానాయాన సంస్థ స్కైఅప్‌.

Read more : Jaipur court : 9ఏళ్ల బాలికపై అత్యాచారం కేసు..9 రోజుల్లో తీర్పు..రేపిస్టుకి 20 ఏళ్ల జైలుశిక్ష..!

స్కైఅప్ అత్యంత తక్కువ ధర కలిగిన అతిపెద్ధ విమానయాన సంస్థ. ఇంతవరకు తమ మహిళా సిబ్బందికి పాత యూనిఫాంగా ఉన్న హైహిల్స్‌, స్కర్ట్స్ లు ధరించేవారు. హైహీల్స్ వల్ల, ఫిట్టుగా ఉండే స్కర్టుల వల్ల పలు ఇబ్బందులు పడేవారు. అనారోగ్యసమస్యలకు గురయ్యేవారు. ఎమర్జన్సీ సమయాల్లో ఫ్లైట్ ఎగ్జిట్‌ డోర్‌ ఓపెన్‌ చేయాలంటే పాపం వారు హైహిల్స్‌ వేసుకుని పరిగెట్టాల్సి వస్తుంది. ఇలా హైహీల్స్, స్కర్టులతో వాళ్లు ఇబ్బందులు ఎన్నో.మహిళా సిబ్బంది పడుతున్నసమస్యలను అర్థం చేసుకున్న స్కైఅప్ సంస్థ ఇకనుంచి వాటికి చెల్లు అని..వారి కంఫర్ట్ గా ఉండే డ్రెస్ కోడ్ ను ప్రవేశపెడుతున్నామని తెలిపింది.

Read more : గాల్లో విమానం.. సిబ్బంది సాయంతో మహిళ ప్రసవం

మారిన డ్రెస్ కోడ్ లో భాగంగా మహిళా సిబ్బంది, ట్రౌజర్లు (ఫ్యాంట్లు), స్నీకర్లు (తేలికపాటి ష్యూ) ధరించవచ్చని స్కైఅప్ ఎయిర్‌లైన్స్ మార్కెటింగ్ హెడ్ మరియన్న గ్రిగోరాష్ వెల్లడించారు. అంతేకాదు.. 1930ల నాటి యూనిఫాంలన్నింటిని అధ్యయనం చేసి మరీ అలాగే మహిళా సిబ్బంది కోసం అత్యంత సౌకర్యవంతమైన నారింజ రంగు యూనిఫాంని డిజైన్‌ చేస్తున్నామని తెలిపారు. ఈ కొత్త యూనిఫాంతో స్కై అప్‌ సంస్థ త్వరలో తమ మహిళా సిబ్బంది ప్రయాణికులకు సరికొత్త యూనిఫాంలో స్వాగతం పలుకుతారని చెప్పింది.

మహిళా ఉద్యోగులు హైహీల్స్, పెన్సిల్ స్కర్ట్స్ టైట్ బ్లౌజ్‌లతో విసిగిపోయారని..పైగా ఈ డ్రెస్సులతో వారు చాలా ఇబ్బందులు పడేవారని..12 గంటలపాటు అదే డ్రెస్ లో ఉండి డ్యూటీ చేయటంతో వారు పలు అనారోగ్యాలకు గురవుతున్నారని..అందుకే వారి సౌకర్యార్థం వారి యూనిఫాంలను మార్చాలనే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. దీంట్లో భాగంగా తమ మహిళా సిబ్బంది స్నీకర్‌లు,ప్యాంటు ధరించే అవకాశాన్ని ఇస్తున్నట్లు ఎయిర్‌లైన్ తెలిపింది.కాగా స్కైఅప్ ఎయిర్ లెన్స్ 2016లో స్థాపించబడింది. ఉక్రెయిన్ లో అత్యంత తక్కువ ధర కలిగిన విమానంగా ఈ సంస్థకు పేరుంది.