గాల్లో విమానం.. సిబ్బంది సాయంతో మహిళ ప్రసవం

గాల్లో విమానం.. సిబ్బంది సాయంతో మహిళ ప్రసవం

గర్భిణీ ప్రసవ సమయంలో విమానాన్ని అర్జెంటుగా ల్యాండ్ చేసిన సందర్భాలు చూశాం కానీ, ఇలా విమానంలోనే ప్రసవించడం చాలా అరుదు. థాయ్‌లాండ్‌కు చెందిన మహిళ మంగళవారం విమానం ప్రయాణిస్తుండగానే ఓ పాపకు జన్మనిచ్చింది. ఖతర్ ఎయిర్‌వేస్‌కు చెందిన సిబ్బంది సాయంతో తెల్లవారుజాము 3గంటల సమయంలో ప్రసవించింది. 

ఆ తర్వాత కోల్‌కతాలో ఎయిర్‌క్రాఫ్ట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. వెంటనే దగ్గర్లోని ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించారు. తల్లి.. పాప క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 

‘కోల్‌కతా ఎయిర్‌పోర్ట్ అధికారులు మాట్లాడుతూ.. దోహా నుంచి బ్యాంకాక్ వెళ్లే QR-830 విమానం తెల్లవారు జాము 3గంటల 9నిమిషాల సమయంలో ఆగింది. ఖతర్ విమానం అత్యవసర సహాయం కావాలని అడగడంతో ఇక్కడ ల్యాండ్ అయ్యేందుకు అనుమతిచ్చాం. విమానం సేఫ్ గా ల్యాండ్ అవడంతో పాటు ఎయిర్‌పోర్టు మెడికల్ డాక్టర్ అత్యవసర సహాయం అందించారని ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు. 

ఇంగ్లీషు మీడియా ఈ వార్తను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అద్బుతమైన స్పందన వస్తుంది. సిబ్బందిని పొగుడుతూ.. బేబీకి పేర్లు సూచిస్తున్నారు. ‘ఇండియా అని పేరుపెట్టిండి’, ‘కంగ్రాచ్యులేషన్స్’, ‘గుడ్ జాబ్’, ‘వెల్‌కమ్ టు ద వరల్డ్ బేబీ’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

గతేడాది జులైలోనూ ఓ మహిళ ఇలాంటి ప్రసవమే అయింది. దోహా నుంచి బీరట్ వెళ్తుండగా గాల్లోనే ప్రసవం జరిగి పాప పుట్టింది.