యూరిన్ ఆపుకుంటున్నారా.. బ్లాడర్ జర భద్రం!!

మహిళల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్(UTI) అనేది కామన్. దీని కారణంగా బ్లాడర్‌కు ఎంతో ప్రమాదముంది. ఫలితంగా స్త్రీలలో లైఫ్ టైం తగ్గిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. బ్లాడర్ ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో తెలుసుకోవాలి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, ప్రతీసారి యూరిన్‌కు వెళ్లాల్సి వస్తుండటం లాంటి కారణాలు ఉన్నప్పుడు మరింత జాగ్రత్త తీసుకోవాలి. వయస్సు పెరిగే కొద్దీ చాలా మందిలో యూరిన్ లీకేజ్ అనేది గమనిస్తూ ఉంటాం’ అని వెల్‌నెస్ కోచ్.. ల్యూక్ కౌటిన్హో అంటున్నారు. 

ఎక్కువ మంది యూరిన్ కు వెళ్లకుండా ఆపుకుంటూ ఉంటారు. అది బ్లాడర్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. దాని కారణంగా ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చేప్రమాదాలు ఉన్నాయి. ప్రతి సమయంలో మన బ్లాడర్ ఖాళీగా ఉందో లేదా అనే అలర్ట్‌లో ఉండాలి. 

1. మల బద్ధకం ఉందా:
మలబద్ధకం ఉన్న వాళ్లు.. శరీరంలోని వ్యర్థాలను విసర్జించాలనుకున్న ప్రతీసారి కష్టపడాలి. దీని వల్ల బ్లాడర్‌పై ఎక్కువ బలం ప్రయోగించాల్సి ఉంటుంది. ఫలితంగా కండరాలు క్రమేపీ బలహీనపడే అవకాశాలు ఉన్నాయి. హెల్తీ లైఫ్ స్టైల్, డైట్‌లో మార్పులు కారణంగా దీనిని అదుపులోకి తీసుకురాగలం.

2. యూరిన్‌ను ఎక్కువసేపు ఆపుకోవద్దు:
బ్లాడర్ బలహీనపడటానికి ప్రధాన కారణాలలో ఇదొకటి. యూరిన్‌ను ఎక్కువ సేపు బ్లాడర్ లో అట్టిపెట్టుకోవడం కారణంగా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఫలితంగా అది బలహీనపడే ప్రమాదం ఉంది. 

3. నిద్రపోయే ముందు నీళ్లు తాగడం:
త్వరగా లేవాలని పడుకునే ముందు నీళ్లు తాగితే యూరిన్ కు వెళ్లే ఆలోచనలో ముందే లేస్తామని అనుకుంటూంటారు. ఇది నిద్రపోవడాన్ని చెడగొట్టడమే కాకుండా.. అప్పటివరకూ యూరిన్ ను స్టోర్ చేసుకునేలా చేస్తుంది. మరి కొందరు యూరిన్ కు వెళ్తే నిద్రచెడిపోతుందని అలాగే నిల్వ ఉంచుకుంటూ ఉంటారు. ఇది చాలా ప్రమాదం.

4. ఆల్కహాల్.. కెఫ్ఫైన్ ఎక్కువ మొత్తంలో:
బ్లాడర్ సమస్య ఉన్న వాళ్లు ఆల్కహాల్.. కెఫ్ఫైన్ మానేయడమే మంచిది. లేదా వీలైనంత వరకూ అలవాటు తగ్గించుకోవడం బెటర్.

5. శరీర బరువు:
శరీర బరువును నియంత్రించుకోవాలి. ఇది కిడ్నీలపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఎక్సర్‌సైజులు, హెల్తీ డైట్లతో ఈ పని చాలా సులువుగా చేయొచ్చు. 

6. కెగల్ ఎక్సర్‌సైజ్‌లు:
ఈ ఎక్సర్‌సైజ్‌లు పెల్విక్‌ను బలపడేలా చేస్తాయి. యూటరస్‌ కండరాలకు, బ్లాడర్, చిన్న పేగుకు, రెక్టమ్ సపోర్ట్ ఇస్తాయి. ఇలా చేయడం వల్ల మగాళ్లలో త్వరగా వీర్య స్కలనం కాకుండా, మహిళ్లలో సెక్సువల్ ఇన్ఫెక్షన్ అవకుండా ఆపగలం.

7. సెక్స్‌కు ముందు తర్వాత:
సెక్స్ చేయడానికి ముందు తర్వాత యూరినేషన్ తప్పనిసరి చేసుకోవాలి. అంతేకాకుండా ముందు నుంచి వెనుక్కు పూర్తిగా తుడుచుకోవడం మరిచిపోకూడదు. 

 

8. కాటన్ అండర్‌వేర్:
కాటన్ తడిని పీల్చుకుంటుందనేది తెలిసిందే. తద్వారా చర్మం పొడిగా ఉంటుంది. టైట్ దుస్తులు వాడటం ద్వారా చెమట పేరుకుపోయి బ్యాక్టీరియా పెరిగే ప్రమాదాలు ఉన్నాయి. 

9. నీళ్లు తాగడం: 
శరీరానికి డీ‌హైడ్రేటెడ్‌గా అనిపించినప్పుడు సరైన మోతాదులో యూరిన్ పాస్ చేయలేం. అంటే ఎక్కువ నీళ్లు తాగకపోవడం వల్ల వచ్చిన సమస్య మాత్రమే కాదు.. ఆరోగ్య సమస్యల కారణంగా ఎలక్ట్రోలైట్స్‌ను శరీరంలోకి పీల్చేసుకోవడం కూడా కావొచ్చు. 

10. డైట్:
చివరిగా చాలా ముఖ్యమైంది డైట్. అరటిపళ్లు, కొబ్బరి, యాపిల్, గ్రేప్స్, అన్నీ బెర్రీ పండ్లు బ్లాడర్ ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకంగా వ్యవహరిస్తాయి. వీటితో పాటు కూరగాయలు.. దోసకాయ, చిక్కుడు లాంటివి. యూరిన్ సమస్యలు ఉన్న వారు పచ్చి ఉల్లిపాయ, టమాటాలు తినడం మంచిది. దాంతో పాటు కాఫీ, టీలు కూడా తగ్గించుకోవాలి.