Hurricane Ida: చీకట్లో 10లక్షల మంది ప్రజలు.. కత్రినా తర్వాత పెద్ద విపత్తు ఇదే!

కరోనాతో తల్లడిల్లుతున్న అమెరికాపై ప్రకృతి కూడా పగబట్టినట్లే కనిపిస్తోంది.

Hurricane Ida: చీకట్లో 10లక్షల మంది ప్రజలు.. కత్రినా తర్వాత పెద్ద విపత్తు ఇదే!

Haricane

Updated On : August 31, 2021 / 2:44 PM IST

One million people: కరోనాతో తల్లడిల్లుతున్న అమెరికాపై ప్రకృతి కూడా పగబట్టినట్లే కనిపిస్తోంది. భీకర తుపానుతో విరుచుకుపడుతూ కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఒకటన్నర దశాబ్ధానికి ముందు అగ్రరాజ్యం అమెరికాను గడగడలాడించిన కత్రినా హరికేన్ మాదిరిగానే ఇప్పుడు ఐదా హరికేన్ విరుచుకుపడుతోంది. అగ్రరాజ్యం అమెరికా చరిత్రలో అత్యంత భారీ నష్టాన్ని మిగిల్చిన హరికేన్​ కత్రినా కాగా.. మళ్లీ ఇన్నేళ్లకు గల్ఫ్ ఆఫ్ మెక్సికో నుంచి లూసియానా వరకు భీభత్సం సృష్టిస్తూ ఐదా హరికేన్ ప్రభావాన్ని చూపిస్తోంది. అమెరికన్లకు ఆందోళన కలిగిస్తోన్న ఈ తుఫాను.. ఏకంగా మిసిసిపీ నదీ ప్రవాహాన్నే రివర్స్​ చేసేయడం చూస్తుంటే, ఎంతటి శక్తవంతం అయ్యిందో ఈ తుఫాన్ అర్థం చేసుకోవచ్చు.

గంటకు 150mph (240km/h) 240 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురు గాలులతో లూసియానా రాష్ట్రం వణికిపోతుండగా.. ఐదా హరికేన్ తరువాత లూసియానాలోని అత్యంత జనసాంద్రత కలిగిన న్యూ ఓర్లీన్స్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వం ముందస్తు హెచ్చరిక జారీ చేసి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. పర్యావరణ మార్పుల కారణంగా ఇలాంటి భారీ హరికేన్లు అమెరికాను చుట్టుముడుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ తుఫాన్ కారణంగా చికట్లలోనే ఉంటున్నారు అక్కడి ప్రజలు. కొన్నివారాల పాటు చీకట్లోనే బతికేస్తూ ఉన్న ఇక్కడి ప్రజలను కదిలిస్తే కన్నీరే వస్తుంది. ఆగ్నేయ లూసియానా మీదుగా.. ఉత్తరం వైపునకు కదిలిన ఐదా హరికేన్… మెక్సికో ఉత్తర గల్ఫ్‌ను దాటి లూసియానా తీరాన్ని తాకింది. ఐదా తుపానుతో కుండపోత వర్షంతోపాటు ప్రచండ గాలులు వీచాయి. గంటకు 240 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో సముద్రం పోటెత్తింది. బలమైన గాలులతో ఇళ్లు ధ్వంసం అయ్యాయి. తీరప్రాంతాల్లోని పోర్టు భవనాల పైకప్పులు ఎగిరిపోగా పరిస్థితి దారుణంగా మారిపోయింది.

మిస్సిసిపిలో ఐదా తుపాను తీవ్ర ప్రభావాన్ని చూపించగా.. తుపాను తీరందాటే సమయంలో వీచిన పెనుగాలుల ధాటికి మిస్సిసిపి నది ఏకంగా రివర్స్ లో ప్రవహించింది. పదుల సంఖ్యలో బ్యారేజీలో కొట్టుకుపోయాయి. న్యూ ఓర్లీన్స్ పైనా ఐదా ఎఫెక్ట్ చూపించింది. ఇక్కడ కూడా పెద్దమొత్తంలో విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో విద్యుత్ నిలిచిపోయింది. న్యూ ఓర్లీన్స్ లో దాదాపు 8లక్షల మంది చీకట్లోనే ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆగస్టు 29, 2005న సంభవించిన కత్రినా తుపాను లూసియానా, మిస్సిసిపిలను కకావికలం చేసింది.

తుపాన్ తీవ్రత తగ్గే వరకు లూసియానా ప్రజలు అధికారుల సూచనలను పాటిస్తూ జాగ్రత్త వహించాలని అధ్యక్షుడు బైడెన్​ సూచించారు. తుపాను ప్రభావిత రాష్ట్రాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రెసిడెంట్ జో బిడెన్ ఈ తుఫానును పెద్ద విపత్తుగా ప్రకటించాడు. రక్షణ మరియు పునరుద్ధరణ ప్రయత్నాల కోసం అదనపు నిధులను విడుదల చేశాడు. లూసియానాలో ఒక మిలియన్ మంది ఇళ్లల్లో విద్యుత్ సరఫారా పూర్తిగా నిలిచిపోగా.. అతిపెద్ద విద్యుత్ సంస్థ అయిన ఎంటర్‌జీ, విద్యుత్‌ను పునరుద్ధరించడానికి ప్రయత్నాలు చేస్తుంది.