ట్రంప్‌ తో రెండో డిబేట్ లో పాల్గొనను…జో బైడెన్

  • Published By: venkaiahnaidu ,Published On : October 7, 2020 / 03:14 PM IST
ట్రంప్‌ తో రెండో డిబేట్ లో పాల్గొనను…జో బైడెన్

Updated On : October 7, 2020 / 3:30 PM IST

US Elections 2020 అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కరోనా నుంచి పూర్తిగా కోలుకోకపోతే… వచ్చేవారం అయనతో జరుగబోయే రెండో డిబేట్ లో తాను పాల్గొనబోనని డెమొక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి జో బైడెన్‌ మంగళవారం స్పష్టం చేశారు. పూర్తిస్థాయి కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ఈ రెండో డిబేట్‌ను నిర్వహించాలనుకున్నాం. కానీ ట్రంప్‌ ఆరోగ్య పరిస్థితి చూస్తే ఇప్పుడు డిబేట్‌ నిర్వహించకపోవడమే మేలు అనిపిస్తోంది అని బైడెన్‌ అన్నారు.

కాగా, ట్రంప్‌-బైడెన్‌ల మధ్య మొత్తం 3 ప్రెసిడెన్షియల్ డిబేట్ లు జరగాల్సి ఉండగా..సెప్టెంబర్-29న మొదటి ప్రెసిడెన్షియల్ డిబేట్ జరిగిన విషయం తెలిసిందే. అక్టోబర్-15న మియామిలో ట్రంప్‌-బైడెన్‌ల రెండో డిబేట్(అధ్యక్ష అభ్యర్థుల ముఖాముఖి)జరగాల్సి ఉంది.

అయితే,తాము చాలా కఠినమైన గైడ్ లైన్స్ ఫాలో అవ్వాల్సిఉంటుందని, ట్రంప్‌ కరోనా నుంచి పూర్తిగా కోలుకోకపోతే అయనతో జరుగబోయే రెండో డిబేట్ లో తాను పాల్గొనబోనని బైడెన్‌ తెలిపారు. అయితే, బైడెన్‌తో రెండో డిబేట్‌కు తాను రెడీగా ఉన్నానని, రెండో డిబేట్ లో పాల్గొనేందుకు తాను ఎదురుచూస్తున్నట్లు ట్రంప్ మంగళవారం ఓ ట్వీట్ లో తెలిపారు.

మరోవైపు, కరోనా సోకడంతో మూడు రోజులపాటు హాస్పిటల్ లో ట్ర్మీట్మెంట్ పొందిన ట్రంప్‌ మంగళవారం డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పూర్తిస్థాయిలో మెరుగుపడిందని డాక్టర్లు ధ్రువీకరించారు