Air Purifier: ప్రపంచంలోనే అతి చిన్న ఎయిర్ ప్యూరిఫయర్ తయారుచేసిన ఇండియన్

ప్రపంచంలోనే అతి చిన్న ఎయిర్ ప్యూరిఫైర్‌ను లాంచ్ చేశారు ఐఐటీ ఢిల్లీ స్టూడెంట్. N95 ఫేస్ మాస్క్‌తో సమానంగా పనిచేస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Air Purifier: ప్రపంచంలోనే అతి చిన్న ఎయిర్ ప్యూరిఫయర్ తయారుచేసిన ఇండియన్

Air Purifier

Updated On : February 25, 2022 / 6:34 PM IST

Air Purifier: ప్రపంచంలోనే అతి చిన్న ఎయిర్ ప్యూరిఫైర్‌ను లాంచ్ చేశారు ఐఐటీ ఢిల్లీ స్టూడెంట్. N95 ఫేస్ మాస్క్‌తో సమానంగా పనిచేస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

నానోక్లీన్ గ్లోబల్, నాసో95 అనేది ఒక N95 గ్రేడ్ నాసల్ ఫిల్టర్. ఇది వ్యక్తి నాసికా కుహరంలో ఇమిడిపోయి బ్యాక్లీరియా, వైరల్ ఇన్ఫఎక్షన్, గాలి కాలుష్యం లోనికి రాకుండా అడ్డుకుంటుంది.

దీనిని నాలుగు సైజుల్లో తయారుచేశారు. జెనెరిక్ ఫేస్‌మాస్క్ లేదా వదులుగా ధరించే మాస్క్ కంటే చాలా బెటర్‌గా పనిచేస్తుందట. భద్రత, సమర్థత అంశాల్లో నేషనల్, ఇంటర్నేషనల్ ల్యాబ్స్ లో పరీక్ష పాస్ అయింది ఈ ప్రొడక్ట్‌.

Read Also: IIT Delhi Covid Test Kit..రూ. 399 లకే

ఈ ప్యూరిఫైర్ ను పిల్లలు కూడా ధరించే వీలుంది. ఎయిర్ బోర్న్ ఇన్ఫెక్షన్స్, ఎయిర్ పొల్యూషన్ నుంచి కాపాడుతుంది స్టేట్మెంట్ లో పేర్కొన్నారు.

టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ సెక్రటరీ రాజేశ్ కుమార్ పఠాక్ మాట్లాడుతూ.. ఈ ప్రొడక్ట్ వయస్సుతో సంబంధం లేకుండా సమాజంలోని అందరికీ మంచి బెనిఫిట్ ఇస్తుందని అన్నారు.

టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్, సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ లీగల్ బోర్డ్ సహకారంతో చాలా మందికి ఈ ప్రొడక్ట్ ను అందించనున్నామని అంటనున్నారు.

Read Also: వేరబుల్ ఎయిర్ ప్యూరిఫైయర్ యూవీ లైట్‌తో 99శాతం వైరస్‌ను చంపేయొచ్చు!

అన్ని వైరస్ ల కంటే గాలి కాలుష్యం చాలా పెద్ద సమస్య అని AIIMS డైరక్టర్ ఎమ్సీ మిశ్రా అన్నారు. ప్రధానంగా లంగ్ క్యాన్సర్ వంటి వాటి బారినపడకుండా Naso95 సహకరిస్తుంది. మెట్రో సిటీల్లోని ప్రధాన సమస్య లంగ్ క్యాన్సర్.