Russia Warning To Ukraine : తక్షణమే ఆయుధాలు వీడండి.. యుక్రెయిన్ దళాలకు రష్యా మరో వార్నింగ్

యుక్రెయిన్ సేనలకు ర‌ష్యా మ‌రోసారి వార్నింగ్ ఇచ్చింది. త‌క్ష‌ణ‌మే ఆయుధాలు వీడాలని అల్టిమేటమ్ జారీ చేసింది.(Russia Warning To Ukraine)

Russia Warning To Ukraine : యుక్రెయిన్ సేనలకు ర‌ష్యా మ‌రోసారి వార్నింగ్ ఇచ్చింది. త‌క్ష‌ణ‌మే ఆయుధాలు వీడాలని అల్టిమేటమ్ జారీ చేసింది. మరియుపోల్ న‌గ‌రాన్ని ర‌క్షించుకుంటున్న వారంతా ఆయుధాల్ని వీడాల‌ని ర‌ష్యా త‌న వార్నింగ్‌లో తెలిపింది. తూర్పు ప్రాంతాల‌పై భీక‌ర దాడులు జ‌రిగే ప్ర‌మాదం ఉంద‌ని యుక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ చెప్పిన కాసేపటికే.. ర‌ష్యా తాజాగా ఈ వార్నింగ్ ఇచ్చింది.

యుక్రెయిన్ ప్ర‌భుత్వ అధికారుల‌కు పిలుపు ఇస్తున్నామ‌ని, ర‌క్ష‌ణ ద‌ళంగా మారిన ఫైట‌ర్లు ఆయుధాలు వీడాల‌ని ర‌ష్యా త‌న ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. యుక్రెయిన్ అధికారులు ఎటువంటి ఆదేశాలు ఇవ్వ‌ర‌ని, కానీ స్వ‌చ్ఛంద ఫైట‌ర్ల‌ను ఉద్దేశించి తాము ఈ ప్ర‌క‌ట‌న చేస్తున్నామ‌ని, వారంతా ఆయుధాల‌ను వీడాల‌ని ర‌ష్యా చెప్పింది. ఆయుధాలు వీడిన వాళ్ల‌కు ప్రాణహాని ఉండ‌ద‌ని ర‌ష్యా ర‌క్ష‌ణ ద‌ళం హామీ ఇచ్చింది.(Russia Warning To Ukraine)

Ukraine russia war : లివివ్‌పై రష్యా సైన్యం క్షిపణుల వర్షం.. జెలెన్ స్కీ ఏం చేశాడంటే..

సైనిక చర్య పేరుతో భీకర దాడులకు తెగబడుతున్న రష్యా సేనలకు యుక్రెయిన్‌ బలగాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతూనే ఉంది. ముఖ్యంగా ప్రధాన నగరాలను స్వాధీనం చేసుకోవడంలో రష్యా సైన్యం తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో మరియుపొల్‌ ముట్టడికి చేరువైన రష్యా సేనలు.. తక్షణమే ఆయుధాలు వీడాలని యుక్రెయిన్‌ సైన్యానికి అల్టిమేటం జారీ చేశాయి.

‘రష్యా సేనలపై ప్రతిఘటిస్తున్న యుయిన్‌ సైనికులను వెంటనే ఆ చర్యలను ఆపేలా ఆదేశాలు ఇవ్వడంతోపాటు అలాంటి అవివేకమైన ప్రతిఘటనకు గల కారణాలను తెలపాలని యుక్రెయిన్‌ అధికారులకు మరోసారి సూచిస్తున్నాం. సైనికులే స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకుని తక్షణమే ఆయుధాలు వీడాలి’ అని రష్యా రక్షణశాఖ పిలుపునిచ్చింది. మరియుపోల్‌ నగరాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు రష్యా సైన్యం చేరువైన సమయంలో ప్రతిఘటించడం వల్ల ఉక్రెయిన్‌ సేనలు మరింత విపత్కర పరిస్థితుల్లో ఉన్నట్లేనని స్పష్టం చేసింది. ఆయుధాలు వీడిన ప్రతిఒక్కరి ప్రాణాల రక్షణకు హామీ ఇస్తున్నామంటూ రష్యా వెల్లడించింది.(Russia Warning To Ukraine)

Russia ukriane war : వ్యూహం మార్చిన రష్యా..మూడో ప్రపంచ యుద్ధం మొదలైందా?!

ఇదిలాఉంటే, యుక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను ఆక్రమించుకోవడంలో విఫలమైన రష్యా బలగాలు తాజాగా తూర్పు ప్రాంతాలపై దృష్టి సారించాయి. ఇదే సమయంలో తమ ప్రాంతాలను కాపాడుకునేందుకు రెండో దశ యుద్ధాన్ని ప్రారంభిస్తున్నామని యుక్రెయిన్‌ ప్రకటించింది. రష్యా సైనికుల సంఖ్యతో నిమిత్తం లేకుండా తమ పోరాటాన్ని కొనసాగిస్తామంది. ఈ నేపథ్యంలో చివరి అవకాశం ఇస్తున్నట్లు పేర్కొన్న రష్యా.. మరియుపోల్‌లో ప్రతిఘటన ఆపకపోతే భారీ స్థాయిలో నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది.

కాగా.. యుక్రెయిన్‌-రష్యా యుద్ధం రోజురోజుకూ తీవ్రమవుతుందే తప్ప, తగ్గే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. కీవ్‌ను ఆక్రమించుకోవడంలో విజయం సాధించలేకపోయిన పుతిన్‌ సేనలు.. యుక్రెయిన్‌ తూర్పు భాగంలోని డాన్‌బాస్‌పై దృష్టిసారించాయి. అక్కడ రెండో దశ యుద్ధం ప్రారంభమైందని, అది కూడా భారీ స్థాయిలో ఉందని కీవ్ వర్గాలు వెల్లడించాయి.

ట్రెండింగ్ వార్తలు