Russia ukriane war : వ్యూహం మార్చిన రష్యా..మూడో ప్రపంచ యుద్ధం మొదలైందా?!

యుక్రెయిన్ పై రష్యా యుద్ధం కొనసాగుతునే ఉంది. అయినా యుక్రెయిన్ ఏమాత్రం తగ్గేదేలేదంటోంది. దీంతో వ్యూహం మార్చింది రష్యా.దీంతో మూడో ప్రపంచ యుద్ధం మొదలైందా?! అనిపిస్తోంది.

Russia ukriane war : వ్యూహం మార్చిన రష్యా..మూడో ప్రపంచ యుద్ధం మొదలైందా?!

Russia Ukriane War

Russia ukriane war : యుక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలు పెట్టి  50 రోజులు దాటింది.  కానీ యుద్ధం మాత్రం ఓ కొలిక్కి రాలేదు. యుక్రెయిన్ రాజధాని కీవ్ పై రష్యా పట్టు సాధించలేకపోతోంది. సాధించలేకపోతోందా? లేదా కావాలని ఆటలాడుతోందా? అనే ప్రశ్న వస్తోంది. లేదంటే అత్యాధునిక ఆయుధాలు కలిగి ఉన్న రష్యా కీవ్ ను స్వాధీనం చేసుకోవటానికి ఇంత సమయం పట్టదు. ఈ క్రమంలో రష్యా పలు విధాలుగా వ్యూహాలు మార్చి యుద్ధాన్ని కొనసాగిస్తోంది. దీంతో ముగింపులేకుండా సాగుతున్న యుక్రెయిన్ యుద్ధం ఏ పరిణామాలకు దారితీస్తుందో ఎవరికీ అర్ధం కావడం లేదు. రష్యా మీడియా మూడో ప్రపంచ యుద్ధం మొదలయిందని వార్తలు ప్రసారం చేస్తోంది. మరోవైపు అమెరికాతో పాటు ఇతర దేశాల నుంచి యుక్రెయిన్‌కు ఆయుధాల సరఫరా ఆగడం లేదు. 2 వారాల క్రితం బలగాలన్నింటీనీ తూర్పు యుక్రెయిన్‌కు తరలించిన రష్యా మళ్లీ వ్యూహం మార్చి కీవ్‌పై విరుచుకుపడుతోంది. ఈ పరిణామాలన్నీ గమనిస్తే..యుద్ధం ఇప్పుడప్పుడే ముగిసే సూచన కనిపించడం లేదు.

Also read : Russia Eyes On Kyiv : అన్నంత పని చేసిన రష్యా.. మళ్లీ అక్కడ క్షిపణుల వర్షం
రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఏం జరుగుతోంది..? యుద్ధం ఏ దిశగా సాగుతోంది..? ప్రపంచ ప్రజలకే కాదు….రణభూమిలో హోరాహోరీ తలపడుతున్న రష్యాబలగాలకు, యుక్రెయిన్ సైనికులకు కూడా జవాబు తెలియన ప్రశ్నలు. ఆ మాటకొస్తే…యుద్ధం మొదలుపెట్టిన పుతిన్‌కు, ప్రతిఘటిస్తున్న జెలన్‌స్కీకి కూడా ఈ ప్రశ్నలకు సమాధానం తెలియదు. మరో వారం రోజుల్లో యుద్ధం మొదలై రెండు నెలలవుతుంది. రెండు రోజుల్లో రష్యా బలగాల కీవ్ ఆక్రమణ పూర్తవుతుందన్నది యుద్ధానికి ముందు అందరి అంచనా. కానీ రెండు నెలలైనా యుక్రెయిన్ రష్యా వశం కాలేదు. అసలు యుక్రెయిన్‌ను స్వాధీనం చేసుకోవాలని రష్యా అనుకుంటోందా…లేక ఆ దేశాన్ని శ్శశానంగా మార్చి వదిలేయాలని భావిస్తోందా లేక…సర్వశక్తులూ ఒడ్డినా…కీవ్‌ను వశం చేసుకోలేకపోతోందా అన్నదానిపై ఎవరికి తోచిన విశ్లేషణలు వారు చేస్తున్నారు. యుద్దంపై అంతర్జాతీయ మీడియా ప్రసారం చేస్తున్న వార్తల్లో నిజమెంతుందో..అబద్దాలెన్నున్నాయో తెలియదు కానీ….రెండు వైపులా అపార ప్రాణనష్టం జరుగుతుందన్నది మాత్రం అందరూ ఒప్పుకుంటున్న నిజం.

Also read : Ukraine Soldiers Surrender : లొంగిపోండి.. ప్రాణభిక్ష పెడతాం-యుక్రెయిన్ సైనికులకు రష్యా అల్టిమేటం
యుద్దం మొదలైన తర్వాత 20వేల300 మంది రష్యా సైనికులు చనిపోయారని యుక్రెయిన్ అంటోంది. 23వేల 367 మంది యుక్రెయిన్ సైనికులు చనిపోయారని రష్యా చెబుతోంది. ఇక యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సాధారణ పౌరుల సంఖ్య ఎంతో అధికారిక లెక్కలకు అందడం లేదు. దాదాపు 50లక్షలమంది యుక్రెయిన్ పౌరులు దేశం విడిచి శరణార్థులుగా వెళ్లిపోయారని ఐక్యరాజ్యసమితి అంచనా. ఏ లెక్కల ప్రకారం చూసినా…యుద్ధం అటు యుక్రెయిన్‌కు, ఇటు రష్యాకు తీరని నష్టం వాటిల్లుతోంది. దీనిపై ప్రపంచమంతా ఆవేదన వ్యక్తమవుతోంది. ఈస్టర్ ప్రసంగంలో పోప్ యుక్రెయిన్ యుద్ధాన్ని ప్రస్తావించారు. రష్యాను విమర్శించారు. కల్లోల పరిస్థితుల్లో వచ్చిన పండుగను….ఈస్టర్ ఆఫ్ వార్ గా పిలిచారు. రక్తం పారుతోందని, హింస అదుపుతప్పిందని ఆరోపించారు.

పోప్ ఫ్రాన్సిసే కాదు…ప్రపంచమంతా యుద్ధం ముగియాలనే కోరుకుంటోంది. కానీ అటు రష్యా కానీ..ఇటు యుక్రెయిన్ కానీ శాంతి చర్చల కోసం అడుగులు వేయడం లేదు. అమెరికా, పాశ్చాత్యదేశాలు యుక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేయడం, రష్యాపై ఆంక్షలు విధించడం ఆపలేదు. దీంతో యుద్ధం అంతకంతకూ మరింత భీకరంగా మారుతోంది. రెండు వారాల క్రితం కీవ్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి బలగాలను పూర్తిగా ఉపసంహరించి…తూర్పు యుక్రెయిన్‌పై దృష్టి పెట్టింది. దీంతో కీవ్ సురక్షితమని అంతా భావించారు. కానీ ఇప్పుడు వ్యూహం మార్చిన రష్యా మళ్లీ కీవ్‌పై విరుచుకుపడుతోంది. దీంతో కీవ్‌లో పెద్దసంఖ్యలో ప్రజలు మరణించినట్టు వార్తలొస్తున్నాయి. కీవ్ వీధుల్లో వందల సంఖ్యలో మృతదేహాలు బయటపడుతున్నాయి.

Also read : Russia-Elon Musk: ఎలాన్ మస్క్ స్టార్ లింక్ ఉపగ్రహాలపై ‘అంతరిక్ష యుద్ధం’ ప్రకటించిన రష్యా

రష్యా మీడియాలో వస్తున్న వార్తలు గమనిస్తే….ఇప్పుడప్పుడే యుక్రెయిన్ యుద్ధం ముగిసే సూచన కనపడడం లేదు. ఇది మూడో ప్రపంచ యుద్ధమే అంటోంది రష్యా. దీనికి కారణం రష్యా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే మాస్క్‌ వా యుద్ధనౌకపై యుక్రెయిన్ దాడి చేయడమే. నల్ల సముద్రంలో రష్యాకు అత్యంత కీలక నౌక ఇది. రాజధాని మాస్కో పేరు కలిసివచ్చేలా దీనికి మాస్క్‌ వా అని పేరు పెట్టారు. ఈ యుద్దనౌకపై యుక్రెయిన్ దళాలు దాడిచేసి ముంచేశాయి. ఈ ఘటనలో 200 మంది రష్యా సైనికులు చనిపోయారని, రెండు అణు వార్ హెడ్‌లు మునిగిపోయాయని భావిస్తున్నారు. 40 ఏళ్ల తర్వాత ఓ యుద్ధనౌక సముద్రంలో మునిగిపోవడం ఇదే తొలిసారి.

మాస్క్‌ వాపై దాడితో రష్యా ఆగ్రహంతో రగిలిపోతోంది. అమెరికా, పాశ్చాత్యదేశాలు అందించిన ఆయుధాలతోనే యుక్రెయిన్ దాడులకు తెగబడుతోందని భావిస్తోన్న రష్యా ఆయా దేశాలకు గట్టి హెచ్చరిక చేసింది. అమెరికా ఆయుధాలు ఆపకపోతే..నేరుగా ఆ దేశంతోనే తలపడాల్సి ఉంటుందని ప్రకటించింది. అటు రష్యా మీడియా అయితే ఇది మూడో ప్రపంచ యుద్ధమే అని తేల్చిచెబుతోంది.

Also read : Russia Bans Boris Johnson : రష్యా ప్రతిచర్య.. బ్రిటన్ ప్రధానిపై నిషేధం

మాస్క్ వా ఘటన తర్వాత యుక్రెయిన్‌ విషయంలో రష్యా కొత్త ప్రణాళికలు రచిస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రష్యా యుక్రెయిన్‌పై అణ్వాయుధాలతో విరుచుకుపడే అవకాశముందని అమెరికా ఆరోపిస్తోంది. అటు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా అణుదాడి చేస్తుందని తాము భయపడడం లేదని, ఆ దాడిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నామని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలన్నీ రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ప్రపంచదేశాల అణ్వాయుధ యుద్దంగా మార్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

మరోవైపు అత్యంత కీలక ప్రాంతం మరియుపోల్‌పై రష్యా మళ్లీ దృష్టిపెట్టింది. మరియుపోల్‌ లోని యుక్రెయిన్ సైనికులు స్వచ్ఛందంగా లొంగిపోవాలని కోరింది. దీనికి యుక్రెయిన్ నిరాకరించింది. దీంతో మరోసారి మరియుపోల్ బాంబులతో దద్దరిల్లే ప్రమాదం కనిపిస్తోంది.