Russia-Elon Musk: ఎలాన్ మస్క్ స్టార్ లింక్ ఉపగ్రహాలపై ‘అంతరిక్ష యుద్ధం’ ప్రకటించిన రష్యా

ఎలాన్ మస్క్ అందించిన స్టార్ లింక్ ఇంటర్నెట్ ద్వారానే యుక్రెయిన్ సేనలు ఈ క్షిపణిని ప్రయియోగించినట్లు గుర్తించిన రష్యా..ఆమేరకు మస్క్ కి చెందిన స్టార్ లింక్ శాటిలైట్ ను ధ్వంసం

Russia-Elon Musk: ఎలాన్ మస్క్ స్టార్ లింక్ ఉపగ్రహాలపై ‘అంతరిక్ష యుద్ధం’ ప్రకటించిన రష్యా

Musk

Russia-Elon Musk: టెస్లా సంస్థ యజమాని ఎలాన్ మస్క్ పై రష్యా అంతరిక్ష యుద్ధం ప్రకటించింది. యుద్ధం అంటే నేరుగా ఢీకొట్టడం కాదు..మస్క్ కి చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ “స్టార్ లింక్”ను ధ్వంసం చేస్తామని రష్యా హెచ్చరించింది. మస్క్ అందించిన ఇంటర్నెట్ ఉపయోగించుకునే యుక్రెయిన్ సేనలు..రష్యాకు చెందిన భారీ యుద్ధనౌక మోస్క్వాను మార్గదర్శక క్షిపణి ప్రయోగించి కూల్చివేశాయి. మోస్క్వా యుద్ధ నౌక రష్యా సైన్యంలో కీలకమైన సేవలు అందిస్తుంది. మోస్క్వా యుద్ధ నౌక కూల్చివేత రష్యాకు పెద్ద ఎదురుదెబ్బగా యూరోప్ మీడియా వెల్లడించింది. యుద్ధ నౌక కూల్చివేతపై ఆగ్రహించిన రష్యా ఆమేరకు యుక్రెయిన్ పై ప్రతీకారం తీర్చుకుంటుంది. అయితే ఎలాన్ మస్క్ అందించిన స్టార్ లింక్ ఇంటర్నెట్ ద్వారానే యుక్రెయిన్ సేనలు ఈ క్షిపణిని ప్రయియోగించినట్లు గుర్తించిన రష్యా..ఆమేరకు మస్క్ కి చెందిన స్టార్ లింక్ శాటిలైట్ ను ధ్వంసం చేస్తామని హెచ్చరించింది.

Also read:Sri lanka crisis : శ్రీలంకలో ప్రజా ఆందోళనలు ఉధృతం.. రోడ్లపైకొచ్చి మద్దతు తెలిపిన క్రికెటర్స్

ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులు ఎక్కడున్నా ఇంటర్నెట్ సర్వీస్ వినియోగించుకునేలా ఎలాన్ మస్క్ ఈ స్టార్ లింక్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేశారు. అంతరిక్షంలో భూమి చుట్టూ ఉండే ఉపగ్రహాల ద్వారా భూమిపై నిరంతరాయంగా ఇంటర్నెట్ వినియోగించుకునే వీలుంటుంది. ప్రస్తుతం రష్యన్ ఫెడరేషన్ భూభాగంపై కదులుతున్న స్టార్‌లింక్ ఉపగ్రహాన్ని నాశనం చేయాలని రష్యా భద్రతా మండలి ప్రస్తుత డిప్యూటీ ఛైర్మన్‌ డిమిత్రి మెద్వెదేవ్ ఆదేశించారు. ఒకరకంగా ఇది అంతరిక్ష యుద్ధమే అయినప్పటికీ..బాహ్య అంతరిక్షంలో సైనిక చర్యకు పాల్పడే ఉద్దేశం లేదని రష్యా వెల్లడించింది.

Also read:Imran Khan: ఆట మార్చేశాడు.. సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఇమ్రాన్ తంటాలు

మోస్క్వా యుద్ధ మునిగిపోవడం రష్యాకు పెద్ద ఎదురు దెబ్బే. ఎందుకంటే ఇది సాధారణ యుద్ధనౌక మాత్రమే కాదు, సముద్రంలో ఎంతో తేలికగా కదిలే ఈ యుద్ధనౌకలో 64 దీర్ఘ-శ్రేణి S-300F క్షిపణులు, 40 మధ్యస్థ-శ్రేణి OSA-AM క్షిపణులు మరియు ఆరు AK-630 క్లోజ్-ఇన్ వెపన్ సిస్టమ్‌లు వంటి అనేక వాయు రక్షణ ఆయుధాలను మోసుకెళ్లగలదు. మరోవైపు రష్యా యుక్రెయిన్ యుద్ధం రెండు నెలలుగా కొనసాగుతూనే ఉంది. ప్రపంచ దేశాలు రష్యాను నిలువరించని పక్షంలో ఆదేశం తమపై అణుబాంబు దాడికి పాల్పడుతుందని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆందోళన వ్యక్తం చేశారు.

Also read:Elephant viral video : నేనుండగా.. నిన్ను పోనిస్తానా.. తల్లి ప్రేమంటే అట్లుంటది మరి..