Russia Eyes On Kyiv : అన్నంత పని చేసిన రష్యా.. మళ్లీ అక్కడ క్షిపణుల వర్షం

చెప్పిన విధంగానే కీవ్‌పై మిస్సైళ్ల వర్షం కురిపించింది. కీవ్ వెలుపల మిలిటరీ ఫ్యాక్టరీ(సైనిక కర్మాగారం)పై దాడి చేసినట్లు..(Russia Eyes On Kyiv)

Russia Eyes On Kyiv : అన్నంత పని చేసిన రష్యా.. మళ్లీ అక్కడ క్షిపణుల వర్షం

Russia Eyes On Kyiv

Russia Eyes On Kyiv : యుక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. రష్యా సేనలు దాడులను మరింత తీవ్రతరం చేశాయి. యుక్రెయిన్ లోని పలు ప్రాంతాలపై బాంబులు, క్షిపణుల వర్షం కురిపిస్తున్నాయి. ఇప్పటికే పలు నగరాలను నాశనం చేసిన రష్యా బలగాలు.. ఇప్పుడు మళ్లీ రాజధాని కీవ్‌పై కన్నేశాయి. యుక్రెయిన్‌ సైన్యం తమపై దాడులకు పాల్పడుతోందని రెండు రోజుల క్రితం ఆరోపించిన రష్యా.. దీనికి ప్రతీకారం తీర్చుకోక తప్పదని బెదిరించిన విషయం తెలిసిందే.

చెప్పిన విధంగానే కీవ్‌పై మిస్సైళ్ల వర్షం కురిపించింది. కీవ్ వెలుపల మిలిటరీ ఫ్యాక్టరీ(సైనిక కర్మాగారం)పై తాజాగా దాడి చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆదివారం రాత్రి ప్రయోగించిన క్షిపణులు కీవ్ ప్రాంతంలోని బ్రోవరీ సెటిల్‌మెంట్ సమీపంలోని సైనిక కర్మాగారాన్ని ధ్వంసం చేశాయని మంత్రిత్వ శాఖ టెలిగ్రామ్‌లో ఒక ప్రకటన చేసింది.(Russia Eyes On Kyiv)

తమ భూభాగంపై విధ్వంసాలకు దిగితే.. కీవ్‌పై క్షిపణుల వర్షం తప్పదని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ గత శుక్రవారం హెచ్చరించింది. ‘రష్యా భూభాగంపై ఏదైనా ఉగ్రదాడులు లేదా విధ్వంసానికి పాల్పడాలని చూస్తే కీవ్‌పై క్షిపణి దాడులు మరింత పెరుగుతాయి’ అని రష్యా రక్షణశాఖ ప్రకటించింది. రష్యా సరిహద్దు నగరాలను లక్ష్యంగా చేసుకుని యుక్రెయిన్‌ క్షిపణి దాడులు చేస్తోందని క్రెమ్లిన్‌ ఆరోపిస్తోంది.

Russia-Elon Musk: ఎలాన్ మస్క్ స్టార్ లింక్ ఉపగ్రహాలపై ‘అంతరిక్ష యుద్ధం’ ప్రకటించిన రష్యా

ఇది ఇలా ఉంటే.. యుక్రెయిన్ సైనికులకు రష్యా అల్టిమేటం జారీ చేసింది. మరియుపోల్‌లో ఉన్న యుక్రెయిన్‌ సైనికులు ఆయుధాలు వీడి లొంగిపోవాలని చెప్పింది. లొంగిపోయిన సైనికులను ప్రాణాలతో వదిలేస్తామంది. జెనీవా ఒప్పందం ప్రకారం లొంగిపోయిన సైనికులను యుద్ధ ఖైదీలుగా పరిగణించి సదుపాయాలు కల్పిస్తామని ప్రకటించింది.

ప్రస్తుతం మరియుపోల్‌లో లక్ష మంది మిగిలి ఉన్నారు. ఈ నగరంలో అత్యధిక ప్రాంతం రష్యా ఆధీనంలోనే ఉంది. ఈ నగరంలో పరిస్థితి దారుణంగా ఉందని యుక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. ఈ నేపథ్యంలో రష్యా అల్టిమేటం విడుదల కావడం గమనార్హం. ఇప్పటికే రష్యా దళాలు ఈ నగరంపై పట్టు సాధించాయి. చాలా చిన్న ప్రాంతాల్లోనే యుక్రెయిన్‌ మద్దతుదారులు ఉన్నాట్టు తెలుస్తోంది.

అణ్వాయుధాలు ప్రయోగిస్తారేమో?- జెలెన్‌స్కీ
యుక్రెయిన్ సేనల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతున్న నేపథ్యంలో రష్యా జీర్ణించుకోలేకపోతోంది. ఈ క్రమంలో తమపై రష్యా అణ్వాయుధాలను వాడే అవకాశం ఉందని, ప్రపంచ దేశాలన్నీ దీనికి సిద్ధంగా ఉండాలని యుక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. యుక్రెయిన్‌ ప్రజల ప్రాణాలంటే పుతిన్‌కు లెక్కలేదని, అందుకే రసాయన ఆయుధాలనైనా తమపై ప్రయోగించే అవకాశం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. యుక్రెయిన్‌ను సులభంగా చేజిక్కించుకోవచ్చనే తప్పుడు అంచనాల్లో శత్రువులు ఉన్నారన్న జెలెన్ స్కీ.. అదంత సులభం కాదన్నారు. తమ దేశం ఎప్పటికీ రష్యా చేతికి చిక్కదని స్పష్టం చేశారు. రష్యాపై మరింతగా ఆంక్షల కొరడా ఝళిపించాలని, అక్కడి నుంచి ఇంధన దిగుమతులను పూర్తిగా నిషేధించాలని ప్రపంచాన్ని కోరారు జెలెన్ స్కీ.

Russia Bans Boris Johnson : రష్యా ప్రతిచర్య.. బ్రిటన్ ప్రధానిపై నిషేధం

ఈ ఏడాది ఫిబ్రవరి 24న యుక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు దిగిన విషయం తెలిసిందే. తొలుత ఉక్రెయిన్‌ సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకున్నామని చెప్పిన మాస్కో.. ఆ తర్వాత సాధారణ జనావాసాలపైనా విరుచుకుపడింది. నానాటికీ ఈ యుద్ధం తీవ్రరూపం దాల్చడమే గాక, వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.