Ukraine russia war : లివివ్‌పై రష్యా సైన్యం క్షిపణుల వర్షం.. జెలెన్ స్కీ ఏం చేశాడంటే..

రష్యాసైన్యం ఉక్రెయిన్‌పై దాడి ఉధృతిని పెంచింది. పలుప్రాంతాల్లో బాంబుల మోత మోగిస్తుంది. శక్తివంతమైన క్షిపణులతో దాడిచేస్తుంది. రష్యా సైన్యం దూకుడుకు లివివ్ ప్రాంత...

Ukraine russia war : లివివ్‌పై రష్యా సైన్యం క్షిపణుల వర్షం.. జెలెన్ స్కీ ఏం చేశాడంటే..

Missiles

Ukraine russia war : రష్యాసైన్యం ఉక్రెయిన్‌పై దాడి ఉధృతిని పెంచింది. పలుప్రాంతాల్లో బాంబుల మోత మోగిస్తుంది. శక్తివంతమైన క్షిపణులతో దాడిచేస్తుంది. రష్యా సైన్యం దూకుడుకు లివివ్ ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు. సోమవారం తెల్లవారు జామున పశ్చిమ ప్రాంతంలో ప్రధాన నగరమైన లివివ్ పై క్షిపణులతో రష్యా సైన్యం విరుచుకుపడింది. పశ్చిమ ఉక్రెయిన్ దేశం ఇతర ప్రాంతాల కంటే రష్యా దాడులకు తక్కువగా ప్రభావితమైంది. తాజాగా ఈ ప్రాంతాన్ని టార్గెట్ గా చేసుకొని రష్యా సైన్యం దాడులు కొనసాగిస్తుంది. సోమవారం తెల్లవారుజామున పశ్చిమ ప్రాంతంలోని లివివ్ నగరాన్ని తాకిన రష్యా క్షిపణుల కారణంగా పేలుళ్లు సంభవించాయని, కొన్ని ప్లాట్లు బ్లాకుల పైన ఆకాశంలో బూడిద పొగ దట్టమైన మేఘాలను చూశామని లివివ్ మేయర్ అండ్రియా సదోవీ తన టెలీగ్రామ్ ద్వారా తెలిపారు. ఐదు క్షిపణులు నగరాన్ని తాకాయని, ప్రజలెవరూ బయటకు రావొద్దని, అందరూ షెల్టర్లలోనే ఉండాలని సూచించారు.

Ukraine Soldiers Surrender : లొంగిపోండి.. ప్రాణభిక్ష పెడతాం-యుక్రెయిన్ సైనికులకు రష్యా అల్టిమేటం

గతవారం రష్యాకు చెందిన ఓ భారీ యుద్ధ నౌకను ఉక్రెయిన్ ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీంతో మరింగ కోప్రోద్రుక్తులవుతున్న రష్యా సైనికులు తమ దాడుల ఉధృతిని మరింత పెంచారు. తూర్పు ప్రాంతంలో పూర్తి పట్టు సాధించడం కోసం దక్షిణ నగరమైన మేరియుపోల్ ను హస్తగతం చేసుకున్న రష్యా ఇప్పుడు పశ్చిమ ఉక్రెయిన్ పై గురిపెట్టినట్లు కనిపిస్తోంది. మరోవైపు రష్యా ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగి 50 రోజులు అవుతుంది. ఫిబ్రవరి 24న రష్యా దాడి ప్రారంభించగా అప్పటి నుండి సుమారు ఐదు మిలియన్ల ఉక్రెయినియన్లు దేశం నుంచి వెళ్లిపోయారు. పలు నగరాలు ధ్వంసమయ్యాయి. వేలాది మంది మరణించారు. శనివారం నాటికి మారియుపోల్ లో ఉక్రెయిన్ 4వేల మందికిపైగా సైనికులను కోల్పోయిందని రష్యా తెలిపింది.

Russia Ukraine War: రష్యా యుద్ధ నౌకను ధ్వంసం చేసిన యుక్రెయిన్.. కీలక ప్రకటన చేసిన రష్యా..

రష్యా సైన్యం క్షిపణులతో ఉక్రెయిన్ పై దాడుల ఉధృతిని పెంచినప్పటికీ తాము వెనక్కు తగ్గేది లేదని, తమఒంట్లో ప్రాణమున్నంత వరకు పోరాటం సాగిస్తామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. మరోవైపు రష్యా దాడులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. శత్రుదేశ సైనికులు తమ భూభాగంలో తీవ్ర హింసకు పాల్పడుతున్నాయని, స్థానిక ప్రభుత్వ ప్రతినిధులను కిడ్నాప్ చేస్తున్నారని జెలన్ స్కీ ఆవేదన వ్యక్తం చేశాడు. అయినా మేం లొంగిపోమని, రష్యా దారుణాలను అడ్డుకునేందుకు మాకు ఆయుధ సాయం చేయండి అంటూ ప్రపంచ దేశాలను జెలన్ స్కీ మరోసారి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఉక్రెయిన్ కు మద్దతుగా ఉన్నాయి. రష్యాపై ఆంక్షలు విధిస్తూ ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నా రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకొనే వరకు వెనక్కు తగ్గేదే లేదన్నట్లు దాడులను మరింత ఉధృతం చేస్తున్నాడు.