Site icon 10TV Telugu

Two Marriages : భలే ఛాన్సులే.. ఆ దేశంలో అబ్బాయిలు రెండో పెళ్లి చేసుకోవాల్సిందే…లేకపోతే జైలుకే

ERITRIA MARRIAGE

ERITRIA MARRIAGE

Two Marriages : వివాహా సాంప్రదాయాలు ఒక్కో ప్రాంతానికి ఒకో రకంగా ఉంటాయి. అలాగే ప్రతి దేశంలో ఆదేశ   పరిస్ధితులను బట్టి వివాహా చట్టాలు ఉంటాయి. ఇక పోతే మన దేశంలో బహు భార్యాత్వం నిషేధం. ఒకవేళ ఎవరైనా పురుషుడు రెండో పెళ్లి చేసుకోవాలంటే మొదటి  భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత రెండో పెళ్లి చేసుకోవాలి. లేదంటే చట్ట విరుధ్దంగా సీక్రెట్ గా రెండో వివాహాన్ని మెయిన్ టైన్ చేయాలి.   ఏది ఏమైనా అది చట్ట వ్యతిరేక కార్యకలాపమే.

కానీ ఆఫ్రికా ఖండంలోని ఎరిత్రియా దేశంలో పురుషులు రెండో పెళ్లి చేసుకోవాల్సిందే. అలా చేసుకోకపోతే వారిని జైలులో పెడతారు. రెండో పెళ్లి చేసుకోకపోతే చట్టరీత్యా నేరం ఆ దేశంలో. ఈ చట్టం కేవలం పురుషులకే కాదు స్త్రీలకు వర్తిస్తుంది. ఎలాగంటే… భర్త రెండో పెళ్లి చేసుకోటానికి   ఏ మహిళ అయినా అభ్యంతరం చెపితే ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

ఎరిత్రియా దేశంలో ఈ రెండు పెళ్లిళ్లు నిబంధన ఏదో తమాషాకు పెట్టలేదు.  అందుకు బలమైన కారణమే ఉంది. ఆ దేశంలో స్త్రీ పురుష నిష్పత్తిలో వ్యత్యాసం చాలా ఉంది. 1998 నుంచి 2000 మధ్య జరిగిని ఇథియోపియా నుండి వేర్పాటు యుధ్ధంలో లక్షలాది మంది పురుషులు చనిపోయారు. దీంతో దేశంలో పురుషుల కొరత ఏర్పడినట్లు సోషల్ మీడియాలో వార్తలు  వెలువడ్డాయి.

మన దేశంలో పురుషులు శాతం ఎక్కువ,  స్త్రీల శాతం తక్కువ. స్త్రీ పురుష నిష్పత్తిని సమం చేయాటానికే ఎరిత్రియా దేశం ఈ రెండు పెళ్లిళ్ల విధానాన్ని చట్టబధ్దం చేసింది. ఈ చట్టంపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తినా ఎరిత్రియా వెనక్కి తగ్గటంలేదు. తమ దేశంలో స్త్రీ పురుష నిష్పత్తిని బ్యాలెన్స్ చేసేందుకు ఇంతకంటే మరో మార్గం లేదని చెపుతోంది.

Also  Read : Eatala Rajender : బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంట విషాదం

Exit mobile version