Russia Condom Sales : యుద్ధం వేళ.. రష్యాలో భారీగా పెరిగిన కండోమ్ అమ్మకాలు

యుక్రెయిన్ తో యుద్ధం వేళ రష్యాలో కండోమ్ అమ్మకాలు భారీగా పెరిగాయి. రష్యన్లు ఎగబడి మరీ కండోమ్స్ కొనేస్తున్నారు.(Russia Condom Sales)

Russia Condom Sales : రష్యా, యుక్రెయిన్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. మూడు వారాలకు పైగా యుక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. రష్యా సేనలు యుక్రెయిన్ పై బాంబులు, మిస్సైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. రష్యా బలగాల దాడిలో యుక్రెయిన్ కు ఊహించని రీతిలో ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోంది. అనుకున్నది సాధించే వరకు యుద్ధం ఆపేది లేదని రష్యా తేల్చి చెప్పింది.

ఇది ఇలా ఉంటే, యుక్రెయిన్ పై యుద్ధం వేళ రష్యాలో ఓ వస్తువుకి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. వాటి అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. ఇంతకీ అదేంటో తెలుసా? కండోమ్. ఏంటి.. నవ్వు వస్తోందా? కానీ, ఇది నిజం. యుక్రెయిన్ తో యుద్ధం వేళ రష్యాలో కండోమ్ అమ్మకాలు భారీగా పెరిగాయి. రష్యన్లు ఎగబడి మరీ కండోమ్స్ కొనేస్తున్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో రష్యా ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్న వస్తువు ఏమైనా ఉందంటే.. అది కండోమ్ అని ఆ దేశపు ప్రముఖ ఆన్‌లైన్ రీటెయిలర్ వైల్డ్‌బెర్రీస్ వెల్లడించింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ప్రస్తుతం రష్యాలో కండోమ్ అమ్మకాలు 170 శాతం పెరిగాయని వివరించింది.(Russia Condom Sales)

Russia-Ukrainian war :యుక్రెయిన్ వదిలిపోతూ..సూట్‌కేసుల నిండా డబ్బుల కట్టలతో దొరికిపోయిన మాజీ ఎంపీ భార్య

రష్యా ప్రజలు కండోమ్‌లను అధికంగా కొనుగోలు చేయడానికి కారణం లేకపోలేదు. ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా రష్యాపై అంతర్జాతీయంగా ఆంక్షలు అమలవుతున్నాయి. అమెరికా సహా పశ్చిమ దేశాలు కఠిన ఆంక్షలు విధించాయి. ముఖ్యంగా యూరప్ దేశాలు.. రష్యాతో వాణిజ్య సంబంధాలు తెంచుకుంటున్నాయి. ఈ క్రమంలో రష్యాలో కండోమ్‌ల కొరత ఏర్పడనుందని, వాటి ధరలు విపరీతంగా పెరగనున్నాయనే పుకార్లు మొదలయ్యాయి. అంతే, ఒక్కసారిగా రష్యాలో కండోమ్ విక్రయాలు గణనీయంగా పెరిగాయి. రష్యన్లు ఎగబడి మరీ కొనేస్తున్నారు. సూపర్ మార్కెట్లు, మెడికల్ స్టోర్లలో కండోమ్ ల అమ్మకాలు గత మార్చితో పోలిస్తే 170 శాతం పెరిగాయి. తమ భవిష్యత్తు అవసరాల కోసం ముందు జాగ్రత్తగా కండోమ్స్ కొంటున్నట్లు రష్యన్లు చెబుతున్నారు.

In Russia, condom sales jump by 170%

మరోవైపు పశ్చిమ దేశాల ఆంక్షల వల్ల రష్యా కరెన్సీ విలువ.. డాలర్, యూరోలతో పోలిస్తే తగ్గుతోంది. ఈ కారణంగా కండోమ్‌ల ధరలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కండోమ్‌లను భవిష్యత్ అవసరాల కోసమే ప్రజలు కొంటున్నారని, అయితే, రానున్న కాలంలో కండోమ్‌లు కొనలేని ధరకు చేరుతాయని ప్రజలు భావిస్తున్నారని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ప్రముఖ ఫార్మా చైన్ కూడా తమ కండోమ్ అమ్మకాల్లో 26 శాతం పెరుగుదల కనిపించిందని చెప్పింది. మొత్తంగా మెడికల్ షాపుల్లో కొనుగోలు చేస్తున్న కండోమ్‌ల సంఖ్యలోనే 32 శాతం పెరుగుదల కనిపిస్తోందట. సూపర్ మార్కెట్లలో కూడా ఈ పెరుగుదల 30 శాతంపైగానే ఉంది. వీటి ధరలు 50 శాతం పెరిగినా కండోమ్ అమ్మకాల్లో మాత్రం తగ్గుదల లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం పశ్చిమ దేశాల ఆంక్షలే అని తెలుస్తోంది.

Russian President Putin : ప్రాణభయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌

కండోమ్ ల కొరత, వాటి ధరల పెంపు పుకార్లపై స్థానిక అధికారులు స్పందించారు. కండోమ్‌ల కొరత అనేది దేశంలో రాదని తేల్చి చెప్పారు. ఎందుకంటే, ప్రపంచంలో కండోమ్‌లు అత్యధికంగా ఉత్పత్తి చేసే భారత్, థాయ్‌ల్యాండ్, దక్షిణ కొరియా, చైనాల నుంచి రష్యాకు దిగుమతులు ఆగలేదన్నారు. కనుక భయపడాల్సిన పని లేదన్నారు. అదే సమయంలో ఆంక్షలు విధిస్తున్న పాశ్చాత్య దేశాలకు చెందిన కంపెనీలకు చెందిన కండోమ్‌లు వాడకుండా.. రష్యా మిత్ర దేశాల నుంచి వచ్చే మంచి కండోమ్‌లు వాడాలని రష్యన్లకు సలహా ఇస్తున్నారట.

ట్రెండింగ్ వార్తలు